ఢిల్లీలో తెలంగాణ పరువు తీసిందెవరు?.. MLC కవితకు మంత్రి సీతక్క కౌంటర్

by Gantepaka Srikanth |   ( Updated:2025-03-21 10:47:07.0  )
ఢిల్లీలో తెలంగాణ పరువు తీసిందెవరు?.. MLC కవితకు మంత్రి సీతక్క కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) తెలంగాణ పరువు తీస్తున్నారని ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha) చేసిన వ్యాఖ్యలకు మంత్రి సీతక్క(Minister Seethakka) ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ పరువు తీసింది.. తీస్తున్నది మీ కుటుంబమే అని అన్నారు. ‘మాకు ఢిల్లీ వ్యాపారాలు తెలియవు. ఢిల్లీ వ్యాపారాలతో రాష్ట్రం పరువు తీసింది మీరు, మీ కుటుంబం కాదా’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్(Congress) పార్టీది త్యాగాల చరిత్ర అని అన్నారు. కరప్షన్‌కి కేరాఫ్ అడ్రస్ బీఆర్ఎస్(BRS) అని విమర్శించారు. ప్రజలు పదేళ్లు అధికారం ఇస్తే.. పదేళ్ల పాటు అడుగడుగునా అన్యాయం చేశారని మండిపడ్డారు.

‘మొదటి ఐదు సంవత్సరాల్లో మంత్రి పదవిలో మహిళలు లేరు, మహిళా కమిషన్‌(Women's Commission)కు సభ్యులు లే‌రు. మహిళలు పొదుపు చేసుకున్న రూ.1800 కోట్ల అభయ హస్తం నిధులు ఇవ్వలేదు. పావలా వడ్డీ ఇవ్వలేదు. మహిళా సంఘాలకు ఇవ్వాల్సిన రూ.3700 కోట్ల వడ్డీలు చెల్లించలేదు’ ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం ఉన్నాయని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

తెలంగాణను మీరు సస్యశ్యామలం చేస్తే, రైతులు ఎందుకు ఇబ్బందులు పడ్డారని ప్రశ్నించారు. తాము కాలువలు మూసివేసినట్లుగా బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ డీఎన్‌ఏ(DNA)లోనే కరప్షన్ ఉందని చెప్పారు. ఇష్టానుసారంగా ఎస్టిమేషన్స్ పెంచి దోచుకుతున్నారని ఆరోపించారు. మీరు నోటిఫికేషన్లు ఇస్తే నియామకాలను ఎవరు అడ్డుకున్నారని అడిగారు. మీరు ఉద్యోగాలు ఇవ్వకుండా నిరుద్యోగులను ఇబ్బంది పెడితే.. మేమొచ్చాక ఒక్కొక్కటిగా సమస్యలను సాల్వ్ చేస్తూ భర్తీ చేసుకుంటూ వెళ్తున్నామని అన్నారు. అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నలోనే 59 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని బాగుంటే.. ప్రజలు ఎందుకు ఓడిస్తారని అన్నారు. బీఆర్ఎస్ నేతలు ఇకనైనా బుద్ధి మార్చుకోవాలని హితవు పలికారు. బీఆర్ఎస్ పార్టీ తొలిసారి 63 సీట్లతో అధికారంలోకి వచ్చిందని.. ఇప్పుడు మేము 65 సీట్లతో అధికారంలోకి వచ్చామని గుర్తుచేశారు.


Read More..

సీఎం పదేపదే ఆ మాట చెప్పడం సరికాదు.. హరీశ్ రావు ఇంట్రెస్టింగ్ కామెంట్స్

Advertisement
Next Story

Most Viewed