పది పరీక్షల సరళిని పరిశీలించిన కలెక్టర్

by Naveena |
పది పరీక్షల సరళిని పరిశీలించిన కలెక్టర్
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి: జిల్లా వ్యాప్తంగా శుక్రవారం ప్రారంభమైన పదవ తరగతి పరీక్షల సరళిని జిల్లా కలెక్టర్ హనుమంతరావు పరిశీలించారు. భువనగిరి పట్టణంలోని గంజ్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్ష కేంద్రాన్ని సందర్శించారు. పరీక్ష నిర్వహణ తీరును కలెక్టర్ పరిశీలించారు. అన్ని గదులను కలెక్టర్ కలియ తిరిగారు. ఎలక్ట్రిసిటీ, తాగునీరు తదితర మౌలిక వసతులను క్షుణ్ణంగా పరిశీలించారు. పరీక్షల నిర్వహణ పైన చీఫ్ సూపరింటెండెంట్ కి పలు సూచనలు అందించారు. సజావుగా అన్ని పరీక్షలు జరిగేలా మానిటరింగ్ చేయాలని ఆదేశించారు.

Next Story

Most Viewed