- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ముస్లింలకు రంజాన్ పవిత్రమైన మాసం.. : ఎమ్మెల్యే మల్లారెడ్డి

దిశ, ఘట్కేసర్ : ముస్లింలకు రంజాన్ మాసం అతి పవిత్రమైనదని మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అన్నారు. ఘట్కేసర్ పట్టణ కేంద్రంలోని జామ మసీద్ దగ్గర బుధవారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి పాల్గొన్నారు. మల్లారెడ్డి ఘట్కేసర్ జామా మసీదు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ అను భాయ్, ముస్లిం సోదరులకు పండ్లను తినిపించి ఇఫ్తార్ తో ఉపవాస దీక్షను విరమింప చేశారు. అనంతరం ముస్లిం సోదరులతో కలిసి మసీదులో నమాజ్ లో మల్లారెడ్డి పాల్గొని మాట్లాడుతూ... ముస్లిం సోదరులకు రంజాన్ పవిత్ర మైన మాసమని ఈ మాసంలో ఖురాన్ దిగి వచ్చినట్లు నమ్ముతారని, ఈ రంజాన్ మాసంలో ముస్లింలు దానధర్మాలు చేయడం పేదలకు సహాయం చేస్తుంటారని అన్నారు.
ఈ పండుగను ఆఖరిగా ఈద్-ఉల్-ఫిత్తర్ గా రంజాన్ పండుగను జరుపుకుంటారన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీలో ఎవరైనా ముస్లింలు చనిపోయినప్పుడు ఖననం చేయడానికి కబ్రస్తాన్ సుమారుగా రెండు కిలోమీటర్ల దూరంలో ఉండటం వలన చనిపోయిన వారికి అక్కడికి తీసుకెళ్లడానికి ఒక ట్రాలీ ఇప్పించాలని జామ మసీదు అధ్యక్షుడు అన్ను భాయ్, ప్రధాన కార్యదర్శి నబి మల్లారెడ్డిని కోరారు. వారి అభ్యర్థన మేరకు త్వరలో మజీద్ కమిటీకి అందజేస్తానని మల్లారెడ్డి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఘట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, ఘట్కేసర్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ పలుగుల మాధవ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకట రెడ్డి, కొమ్మగోని రమాదేవి మహిపాల్ గౌడ్, కొమ్మిడి అనురాధ రాఘవరెడ్డి, బండారి ఆంజనేయులు గౌడ్, బేతాళ నర్సింగ్ రావు, మైనార్టీ నాయకులు ఎమ్ ఎ ఖలీల్, ఆయూబ్ , ఎండి నజీర్, ఫిరోజ్ ఖాన్, షకీల్, తదితరులు పాల్గొన్నారు.