- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రయాణికులకు HYD మెట్రో శుభవార్త

దిశ, వెబ్‌డెస్క్: ప్రయాణికులకు హైదరాబాద్ మెట్రో(Hyderabad Metro) యాజమాన్యం భారీ శుభవార్త చెప్పింది. రేపటి నుంచి ఐపీఎల్-2025(IPL 2025) ప్రారంభం కాబోతున్న వేళ మెట్రోరైలు(Metro Rail) సమయం పొడిగించింది. రేపటి నుంచి ఐపీఎల్ సీజన్ ముగిసే వరకు చివరి మెట్రో రైలు రాత్రి 12.15 గంటలకు బయల్దేరి.. 1.10 గంటలకు గమ్యస్థానాలకు చేరుకుంటాయని ప్రకటన చేశారు. అది కూడా.. నాగోల్, ఉప్పల్, స్టేడియం అండ్ ఎన్‌జీఆర్ఐ స్టేషన్‌లలో మాత్రమే ప్రవేశం ఉంటుందని పేర్కొంది. మరోవైపు.. ఎల్లుండి హైదరాబాద్ వేదికగా జరిగే ఎస్ఆర్‌హెచ్ తొలి మ్యాచ్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
2700 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఉప్పల్ స్టేడియంతో పాటు పరిసరాల్లో 450 సీసీ కెమెరాలు పెట్టారు. సీసీటీవీ కెమెరాల పరిశీలనకు మైదానంలోనే ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. మ్యాచ్ చూసేందుకు వచ్చే మహిళా అభిమానుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. మైదానం పరిసరాల్లో ఐదు భారీ పార్కింగ్ ప్రాంతాలు సిద్ధం చేశారు. మ్యాచుకు 3 గంటల ముందు నుంచే ప్రేక్షకులను స్టేడియం లోపలికి పంపించనున్నారు. లోపలికి వెళ్లే వారు.. బ్యాగులు, వాటర్ బాటిల్స్, అగ్గిపెట్టెలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకెళ్లకూడదని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు.