Chittoor: టీడీపీ కార్యకర్త హత్య.. కారణం ఇదే..!

by srinivas |
Chittoor: టీడీపీ కార్యకర్త హత్య.. కారణం ఇదే..!
X

దిశ, వెబ్ డెస్క్: ఈ నెల 15న చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో టీడీపీ కార్యకర్త రామకృష్ణ హత్య జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసును పోలీసుల ఛేదించారు. ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రధాన నిందితుడు వెంకటరమణతో పాటు ఏ5 రెడ్డప్పరెడ్డి అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో ముగ్గురి కోసం గాలిస్తున్నారు. ప్రత్యర్థులను భయపెట్టేందుకే రామకృష్ణను హత్య చేశామని నిందితులు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు రెడ్డప్పరెడ్డి.. రామకృష్ణ హత్యకు ముందుకు పలువురు వైసీపీ ముఖ్యనాయకులతో ఫోన్ మాట్లాడారని తాము గుర్తించినట్లు చెప్పారు. నిందితులు భూ కబ్జాలు, బెదిరింపులకు పాల్పడినట్లు సేకరించినట్లు తెలిపారు. వీరి అక్రమాలపై రామకృష్ణ పోరాటం చేసినందుకే చంపినట్లు అనుమానిస్తున్నామని పోలీసులు పేర్కొన్నారు.

Next Story

Most Viewed