Mallareddy: అదే జరిగితే ఎంపీగా పోటీ చేస్తా.. మల్లారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

by Shiva |
Mallareddy: అదే జరిగితే ఎంపీగా పోటీ చేస్తా.. మల్లారెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)తో మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (Malla Reddy), ఆయన అల్లుడు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి (Marri Rajashekar Reddy) భేటీ అవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో సీఎంను కలవడంపై మల్లారెడ్డి ఇవాళ మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. జిల్లాలో అభివృద్ధి పనులు, అదేవిధంగా మెడికల్ (Medical), ఇంజినీరింగ్ (Engineering) సీట్ల విషయంలో తాను సీఎంను కలిసినట్లుగా పేర్కొన్నారు. నియోజకవర్గంలో పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయాలని సీఎం కలిస్తే.. అందులో తప్పేముందని అన్నారు. 72 ఏళ్ల వయసులో తానేందుకు పార్టీ మారుతానని కామెంట్ చేశారు. ప్రస్తుతం కాంగ్రెస్‌ (Congress)లోకి వెళ్లినోళ్లే చాలా పరేషాన్లో ఉన్నారని సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ (BRS) నుంచి పోటీకి తమ కుటుంబం నుంచి మొత్తం నలుగురు సిద్ధంగా ఉన్నారంటూ చమత్కరించారు. ఒకవేళ జమిలీ ఎన్నికలు (Jamili Elections) వస్తే.. తాను పక్కా ఎంపీగానే పోటీ చేస్తానని స్పష్టం చేశారు.

Next Story