- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
రామ్ చరణ్ బర్త్ డే స్పెషల్.. మెగా అభిమానుల కీలక నిర్ణయం

దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో(Mega Hero), గ్లోబర్ స్టార్ రామ్ చరణ్(Ram Charan).. ఈనెల 27వ తేదీన తన 40వ జన్మదిన వేడుక జరుపుకోబోతున్నారు. ఈ నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెగా అభిమానులు కీలక నిర్ణయం తీసుకున్నారు. అఖిల భారత చిరంజీవి యువత(Akhila Bharatha Chiranjeevi Yuvatha) ఆధ్వర్యంలో మార్చి 27వ తేదీన అభిమానులంతా మొక్కలు నాటాలని నిర్ణయించారు. సోషల్ మీడియా వేదికగా ఈ పిలుపునిచ్చారు. ‘‘మొక్కలు నాటుదాం.. పర్యావరణాన్ని కాపాడుదాం.. వృక్షాలుగా ఎదగనిద్దాం.. భవిష్యత్ తరాలకు నీడనిద్దాం’’ అని సూచించారు.
మరోవైపు చరణ్ పుట్టినరోజు #RC16 నుంచి కూడా అప్డేట్ ఉంటుందని అభిమానులు భావిస్తున్నారు. ఇప్పటివరకు టైటిల్ రివీల్ చేయకపోవడంతో.. పుట్టినరోజునే టైటిల్‌తో పాటు టీజర్ గ్లింప్స్ కూడా విడుదల అవుతాయని ఆశపడుతున్నారు. దీనిపై చిత్రబృందం నుంచి ప్రకటన రాలేదు. అప్‌డేట్ ఉంటుందో లేదో తెలియాలంటే.. బర్త్ డే వరకూ ఆగాల్సిందే. బుచ్చిబాబు(Buchi Babu) ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్(Bollywood) బ్యూటీ జాన్వీ కపూర్(Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తోంది. ఏఆర్ రెహమాన్(AR Rahman) సంగీతం అందిస్తున్నారు.
ఇటీవల తమిళ అగ్ర దర్శకుడు శంకర్(Director Shankar) కాంబినేషన్‌లో వచ్చిన గేమ్ ఛేంజర్ సినిమా(Game Changer Movie) అభిమానులను నిరాశ పర్చింది. దీంతో చరణ్(Ram Charan) ఫ్యాన్స్‌తో పాటు మెగా ఫ్యాన్స్(Mega Fans) కూడా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నారు.