- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
‘SSMB-29’లో మలయాళ నటుడు.. ఇందులో ఏడాది క్రితమే భాగమయ్యానంటూ ఆసక్తికర కామెంట్స్

దిశ, సినిమా: టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి(Rajamouli) తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ చిత్రం ‘SSMB-29’. ఈ సినిమాలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) హీరోగా నటిస్తుండగా.. హాలీవుడ్ స్టార్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra)హీరోయిన్‌గా కనిపించనుంది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ స్టార్ట్ అవనప్పటికీ ఎన్నో వార్తలు వచ్చి అందరిలో భారీ అంచనాలను పెంచేశాయి. ఈ నేపథ్యంలో.. తాజాగా, ‘SSMB-29’సినిమాలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran)కూడా కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.
ఈ విషయంపై స్పందిస్తూ ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. ‘‘లీక్ వీడియోలు చూడడానికి ప్రేక్షకులు ఎందుకు ఉత్సాహంగా ఉంటారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. అందులో గొప్పతనం ఏముంటుంది అలా చూడడం వల్ల మీరు ఆసక్తిని కోల్పోతారు. అయితే బిగ్‌స్క్రీన్‌పై ఆ సన్నివేశాన్ని ఆస్వాదించలేరు కాబట్టి థియేటర్స్‌లో చూడటం మంచిది. రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘SSMB-29’సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దాని గురించి ఇప్పుడేం మాట్లాడలేను. త్వరలోనే దీనిపై టీమ్ నుంచి అప్డేట్స్ రావాలని కోరుకుందాం.
కానీ నేను మాత్రం ఎలాంటి విషయాన్ని చెప్పాలనుకోవడం లేదు. అయితే నేను ఈ సినిమాలో ఏడాది క్రితమే భాగమయ్యాను. షూటింగ్స్‌లో పాల్గొంటున్నాను. అప్పటినుంచి ఈ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నాం’’ అని చెప్పుకొచ్చారు. కాగా, ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ ‘L2: ఎంపురాన్’మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో మోహన్‌లాల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రం మార్చి 27న థియేటర్స్‌లోకి రానుంది.
Read More..