MEA: అమెరికాలోని భారతీయులకు విదేశాంగ శాఖ కీలక సూచనలు

by Shamantha N |
MEA: అమెరికాలోని భారతీయులకు విదేశాంగ శాఖ కీలక సూచనలు
X

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) అధికారంలోకి రాగానే అక్రమ వలసపై దృష్టి సారించారు. కాగా.. ఈ మేరకు కేంద్రం అమెరికాలోని భారతీయ విద్యార్థులకు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక సూచనలు చేసింది. యూఎస్‌లోని భారతీయ విద్యార్థులు అక్కడ ప్రభుత్వ చట్టాలకు (American laws) కట్టుబడి ఉండాలని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సూచించారు. విదేశీ పౌరులు భారతదేశానికి వచ్చినప్పుడు.. వారు మన చట్టాలు, నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆశిస్తామన్నారు. అధే విధంగా భారతీయ పౌరులు విదేశాల్లో ఉన్నప్పుడు కూడా వారు స్థానిక చట్టాలు, నిబంధనలకు పాటించాలని కోరారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా అమెరికాలోని భారత ఎంబసీ, కాన్సులేట్ కార్యాలయాలను సంప్రదించాలని అన్నారు. విద్యార్థులు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పుకొచ్చారు.వీసాలు, వలస విధానాలపై నిర్ణయాలు పూర్తిగా ఆయా దేశాల విచక్షణాధికారానికి సంబంధించినవిగా పేర్కొన్నారు. వాటిని పాటించాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని స్పష్టం చేశారు.

ఇద్దరిపై వేటు

అయితే, ఇటీవలే ఇద్దరు విద్యార్థులను ట్రంప్ బహిష్కరించారు. హమాస్ తో సంబంధాలున్నాయన్న అనుమానంతో ఇటీవలే భారతీయ పరిశోధకుడు బాదర్ ఖాన్ సూరిపై అమెరికా బహిష్కరణ వేటుపడింది. అంతకుముందు మరో స్టూడెంట్ రంజిని శ్రీనివాసన్ కూడా బహిష్కరణకు గరయ్యింది. సూరి నిర్బంధం గురించి మీడియా నివేదికల ద్వారానే తెలిసిందని జైస్వాల్ అన్నారు. అమెరికా ప్రభుత్వం లేదా సూరి ఎవరూ తమను సంప్రదించలేదన్నారు. రంజిని శ్రీనివాసన్ సహాయం కోసం ఏ భారతీయ కాన్సులేట్‌ను సంప్రదించలేదని చెప్పుకొచ్చారు. ఆమె అమెరికా నుండి బయలుదేరిన విషయం మీడియా నివేదికల ద్వారానే మాకు తెలిసిందన్నారు. ఆమె కెనడాకు వెళ్లిందని చెప్పుకొచ్చారు.

Next Story

Most Viewed