KTR: నేను ఏం చేసినా.. తెలంగాణ ప్రతిష్ట కోసమే చేశా: కేటీఆర్ హాట్ కామెంట్స్

by Shiva |   ( Updated:2025-01-09 05:03:07.0  )
KTR: నేను ఏం చేసినా.. తెలంగాణ ప్రతిష్ట కోసమే చేశా: కేటీఆర్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-కారు రేసు (Formula E-Car Race) నిర్వహణలో తాను క్విడ్‌ప్రోకో (Quid Pro Quo)కి పాల్పడ లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) కామెంట్ చేశారు. ఇవాళ ఏసీబీ (ACB) కార్యాలయానికి విచారణకు వెళ్లే మందు నంది‌నగర్‌ (Nandi Nagar)లోని నివాసం వద్ద ఆయన మాట్లాడారు. తాను కేసీఆర్ (KCR) సైనికుడినని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం (BRS Government) అధికారంలో ఉన్నప్పుడు తమ బావమరుదులకు రూ.1,137 కోట్ల కాంట్రాక్ట్ కోసం పని చేయలేదని ఎద్దేవా చేశారు. మంత్రిగా తాను కేబినెట్‌లో కూర్చొని ఏకంగా కొడుకు కంపెనీకి కాంట్రాక్టులు ఇచ్చుకోలేదని ఫైర్ అయ్యారు.

అప్పనంగా వచ్చిన సొమ్ముతో ల్యాండ్‌క్రూజర్ (Landcruiser) కార్లు కొనుక్కోలేదని సెటైర్లు వేశారు. తాను రూ.50 లక్షలతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి పోయి అడ్డంగా దొరికిపోయిన దొంగను కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నిఖార్సైన తెలంగాణ బిడ్డనని అన్నారను. ఫార్ములా ఈ- కారు రేసు (Formula E-Race) నిర్వహణలో అర పైసా అవినీతి కూడా తాను చేయ లేదని అన్నారు. తెలంగాణ (Telangana) ప్రతిష్ఠను పెంచడానికే తాను ఫార్ములా ఈ-రేసును నిర్వహించానని తెలిపారు. హైదరాబాద్ (Hyderabad) బ్రాండ్ ఇమేజ్‌ (Brand Image)ను పెంచడానికే తాము ప్రయత్నించామని అన్నారు. ఫార్ములా ఈ-రేసు కేసు (Formula E-Race Case)లో తాను క్విడ్‌ప్రోకో(Quid Pro Quo)కి పాల్పడ లేదని.. అలాంటి తెలివితేటలు కాంగ్రెస్ (Congress) నాయకులకే ఉన్నాయని అన్నారు. అవసరం అయితే చస్తానని.. లుచ్చా పనులు మాత్రం చేయనని అన్నారు. న్యాయస్థానాలపై తమకు నమ్మకం ఉందని.. నిజం నిలకడ తెలుస్తుందని తెలిపారు. తాను ఏం చేసినా తెలంగాణ ప్రతిష్ట కోసమే చేశానని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story