Tirupati: పరామర్శకు వెళ్లి సొంత కార్యకర్తలను అలా చేస్తావా.. రోజమ్మా?

by srinivas |
Tirupati: పరామర్శకు వెళ్లి సొంత కార్యకర్తలను అలా చేస్తావా.. రోజమ్మా?
X

దిశ, వెబ్ డెస్క్: వైసీపీ(Ycp) హయాంలో మాజీ మంత్రి రోజా(Former Minister Roja) ఫేర్ బ్రాండ్‌గా వెలుగు వెలిగారు. అధికారం పోవడంతో సెలైంట్ అయిపోయారు. దీంతో రోజా ఫైర్ కాదు.. ప్లవర్ అంటూ విమర్శలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆమె మళ్లీ ఫైర్ అనిపించుకుంది. కోపంతో ఉగిపోయింది. ఎదురు ఉంది ఎవరనేది కూడా చూడలేదు. సొంత కార్యకర్త వీపు పగలకొట్టింది. ఈ సీరియస్ ఇన్సిడెంట్ తిరుపతి(Tirupati)లో జరిగింది.

శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన(Srivari Vaikuntha Dwara Darshans ) టోకెన్ల కోసం తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందగా.. పలువురి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. అయితే బాధితులకు పరామర్శించేందుకు వైసీపీ టీమ్ తిరుపతి వెళ్లింది. అదే సమయంలో అధినేత వైఎస్ జగన్(Ys Jagan) కూడా వచ్చారు. దీంతో వైసీపీ కార్యకర్తల రద్దీ విపరీతంగా పెరిగింది. ఈ రద్దీలో రోజాతో పాటు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన రెడ్డి చిక్కుకున్నారు. ముందుకు కదలలేని పరిస్థితి నెలకొంది. రోజా చుట్టూ కార్యకర్తలు భారీగా చేరారు.

దీంతో రోజా ముందుకు కదలేకపోయారు. అయితే ఆమె ఓర్పు పట్టలేకపోయారు. ఒక్కసారిగా ఉగ్రరూపం చూపించారు. సొంత పార్టీ కార్యకర్తలను చేతితో కొడుతూ, పక్కకు నెడుతూ ముందుకు సాగారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆమెపై విమర్శలు కురుస్తున్నాయి. బాధితుల పరామర్శకు వెళ్లి సహనంగా ఉండాలి కానీ, ఇలా ఫైర్ అయితే ఎలా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

Next Story