Mercedes-Benz: ఈ ఏడాది ఎనిమిది కొత్త కార్ల విడుదల: మెర్సిడెస్ బెంజ్

by S Gopi |
Mercedes-Benz: ఈ ఏడాది ఎనిమిది కొత్త కార్ల విడుదల: మెర్సిడెస్ బెంజ్
X

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఈ ఏడాదిలో కొత్తగా ఐనిమిది కార్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. గురువారం 2025 ఏడాదికి సంబంధించిన రోడ్‌మ్యాప్ గురించిన మాట్లాడిన కంపెనీ సీఈఓ, ఎండీ సంతోష్ అయ్యర్.. కంపెనీ పోర్ట్‌ఫోలియోపై ప్రత్యేకంగా దృష్టి సారించామని,దేశవ్యాప్తంగా బెంజ్ టచ్ పాయింట్లను పెంచుతామని చెప్పారు. కొత్తగా విడుదల చేయబోయే కార్లలో ఎంతో కాలంగా భారతీయులు ఎదురుచూస్తున్న మోడల్ ఏఎంజీ జీఎల్ఈ 53 కూపే కూడా ఉందని సంతోష్ తెలిపారు. ఈ కారును రెండో త్రైమాసికంలో తీసుకురానున్నామని పేర్కొన్నారు. మెర్సిడెస్ బెంజ్ రాబోయే మూడేళ్లలో దేశీయంగా రూ. 450 కోట్ల పెట్టుబడులకు సిద్ధమవుతోంది. దేశంలోని చిన్న నగరాలకు ప్రాధాన్యత ఇస్తూ 2025 చివరి నాటికి 20 కొత్త ఔట్‌లెట్లను అందుబాటులోకి తీసుకొస్తామని సంతోష్ అయ్యర్ వివరించారు. గతేడాది కంపెనీ మొత్తం 19,565 కార్లను విక్రయించిందని, కొత్తగా 14 మోడళ్లను మార్కెట్లోకి తీసుకొచ్చినట్టు తెలిపారు. ఈ ఏడాది కూడా అదే ధోరణిలో కొత్త మోడళ్లతో పాటు అప్‌డేట్ వెర్షన్‌లను విడుదల చేస్తామని సంతోష్ వెల్లడించారు. ఇక, ఎలక్ట్రిక్ విభాగంలో అమ్మకాలు రెట్టింపు కంటే ఎక్కువ ఉన్నాయని సంతోష్ అయ్యర్ చెప్పారు. మొత్తం అమ్మకాల్లో ఎలక్ట్రిక్ కార్లు 2.5 శాతం నుంచి 6 శాతానికి చేరుకున్నాయని పెర్కొన్నారు.

Advertisement

Next Story