- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
KTR: నేడు ఏసీబీ విచారణకు హాజరుకానున్న కేటీఆర్.. హరీశ్‌రావు హౌజ్ అరెస్ట్
దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేసు (Formula E-Race)లో నిధుల దుర్వినియోగం చేశారనే అభియోగాల నేపథ్యంలో విచారణకు హజరు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR)కు ఏసీబీ (ACB) అధికారులు ఇప్పటికే రెండు సార్లు నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ ఆయన ఏసీబీ (ACB) ఎదుట విచారణకు హాజరు కానున్నారు. ఉదయం 9:30కి నందినగర్ (Nandi Nagar)లోని తన నివాసం నుంచి బయలుదేరి 10 గంటల వరకు బంజారా హిల్స్ (Banjara Hills)లోని ఏసీబీ కార్యాలయానికి (ACB Office) చేరుకుంటారు. ఆయన వెంట న్యాయవాది ఏఏజీ రామచందర్ రావు విచారణకు రానున్నారు.
పట్టణ, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దాన కిశోర్, కేసులో A2గా ఉన్న అరవింద్ కుమార్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆధారంగా ఏసీబీ అధికారులు కేటీఆర్‌ను విచారించి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయనున్నారు. మరోవైపు ఫార్ములా ఈ-రేసు కేసు (Formula E-Race Case)లో కేటీఆర్‌ను అరెస్ట్ చేస్తారని పుకార్లు వినిపిస్తుండటంతో బీఆర్ఎస్ (BRS) శ్రేణుల్లో ఆందోళన మొదలైంది. ఇవాళ ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు అవుతోన్న తరుణంలో నగరంలో అల్లర్లు జరిగే అవకాశం ఉండటంతో బీఆర్ఎస్ ముఖ్య నేతల ఇళ్ల వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. అదేవిధంగా మాజీ మంత్రి హరీశ్ రావు (Harish Rao)ను పోలీసులు బయటకు రాకుండా హౌజ్ అరెస్ట్ చేశారు. ఆయన నివాసం వద్ద పోలీసులను భారీగా మోహరించారు.
కాగా, ఈ నెల 6న ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరయ్యారు. అయితే విచారణలో భాగంగా తన వెంట లాయర్‌ను అనుమతించకపోవడంపై కేటీఆర్ (KTR) తీవ్ర అభ్యతరం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న ఏసీబీ అడిషనల్ ఎస్పీ (ACB Additional SP)తో వాగ్వాదానికి దిగారు. తన వెంట లాయర్‌ను అనుమతిస్తేనే విచారణకు వస్తానని తేల్చి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో ఏసీబీ (ACB) విచారణకు తన వెంట లాయర్‌ను అనుతించాలని కోరుతూ.. కేటీఆర్ హైకోర్టు (High Court)లో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయగా.. బుధవారం ధర్మాసనం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఏసీబీ విచారణలో కేటీఆర్ (KTR) వెంట న్యాయవాది కలిసి కూర్చునేందుకు అనుమతించే ప్రసక్తే లేదని కోర్టు తెలిపింది. సీసీ టీవీ (CC TV) పర్యవేక్షణలో కేటీఆర్‌ను విచారించాలని, విచారణ సమయంలో లైబ్రరీ రూం (Library Room)లో ఆయన లాయర్ కూర్చునేందుకు అనుమతించాలని హైకోర్టు (High Court) అధికారులను ఆదేశించింది. కేటీఆర్, అతడి లాయర్ వేర్వేరు గదుల్లో ఉండాలని ధర్మాసనం తెలిపింది. అదేవిధంగా వీడియో (Video), ఆడియో (Audio) రికార్డింగ్‌కు మాత్రం అనుమతించట్లేదని, ఈ విషయంలో ఇంకా ఏమైనా అభ్యంతరాలుంటే మళ్లీ కోర్టుకు రావొచ్చన్న న్యాయమూర్తి స్పష్టం చేశారు.