వామ్మో చలి కాలం.. పిల్లలు జర భద్రం..

by Sumithra |
వామ్మో చలి కాలం.. పిల్లలు జర భద్రం..
X

చల్లటి వాతావరణంతో జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఫ్లూ జ్వరం, ఆయాసం, స్వైన్‌ఫ్లూ కేసులు పెరుగుతున్నాయి. అస్తమా, సీవోపీడీ (క్రానిక్‌ అబ్‌స్ట్రక్టివ్‌ పల్మనరీ డీసీజ్‌), అలర్జీ, న్యుమోనియా తదితర శ్వాసకోశ వ్యాధుల ముప్పు పొంచి ఉంది. శ్వాసకోశ వ్యాధులతో రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వారి పై వైరస్‌ త్వరగా దాడి చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

దిశ, జనగామ : డిసెంబర్ మొదలైందంటే చాలు. చలి..చలి.. వాతావరణంలోని మార్పులతో పాటు శరీరంలో అనేక మార్పులకు చేటుచేసుకుంటుంది. అయితే ఇది ఈ మార్పులు పెద్దలకు మాత్రమే కాదు.. పిల్లల పట్లకూడా తీవ్రంగా ఉంటుంది అనేది తెలిసిందే. ఈ కాలంలో పిల్లలకు సంబంధించి, పెద్దలకున్న అనేక సమస్యల్లో అసలు సమస్య పొద్దున్నే నిద్రలేవడం దగ్గర్నుంచి మొదలవుతుంది. పొద్దున్న ఎనిమిదవుతున్నా ఇంకా ముసుగులోని వెచ్చదనాన్ని విడిచిపెట్టి బయటకు రావడానికి ఇష్టపడని పిల్లల్ని ‘స్కూలుకి టైమ్ అవుతోందంటూ తిరిగి రొటీన్‌ లోకి తీసుకురావడానికి తల్లిదండ్రులు పడే అవస్థలు శీతాకాలంలో ప్రతి ఇంట్లోనూ సాధారణంగా కనిపించే ఆహ్లాదకర దృశ్యాలు. ఇలా పొద్దున్నే లేవడమే కాదు, చలికాలంలో పిల్లలకు మరెన్నో సమస్యలు. వీటిలో ముఖ్యమైనవి ఆరోగ్యానికి సంబంధించినవి. అందుకే తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఈ కాలంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని, కొన్ని జాగ్రత్తలు పాటించాలి. పిల్లలకు కాలాలతో పనిలేదు. కాలం ఏదైనా వారి ఆటలు, వారి ఐస్‌క్రీంలు, వారి చాక్లెట్లు, వారి కూల్‌డ్రింకులు వారివే. కాబట్టి తల్లిదండ్రులే ఈ విషయాలు గమనిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ జాగ్రత్తలు ఏమిటో తెలుసుకొనే ముందు అసలు చలికాలంలోనే పిల్లలకు ఈ ఇబ్బందులు ఎందుకొస్తాయనే పరిజ్ఞానం తల్లిదండ్రులకు ఉండడం చాలా అవసరం అనేది డాక్టర్లు చెబుతున్నారు.

సీజనల్ వ్యాధులు.. లక్షణాలు వ్యాధి లక్షణాలు..

మలేరియా : చలి, జ్వరం, తలనొప్పి, దగ్గు, వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు, నీరసం.

డయేరియా : విరేచనాలు, కడుపు నొప్పి, వికారం.

టైఫాయిడ్ : జ్వరం, నీరసం, కడుపులో నొప్పి

కలరా : నీళ్ల విరేచనాలు, వాంతులు, కాళ్లు లాగడం.

డెంగ్యూ: హఠాత్తుగా జ్వరం, భరించలేని తల, కండరాలు, కీళ్లు నొప్పులు, ఆకలి మందగించడం, వాంతులు, ఒంటి పై ఎర్రటి మచ్చలు

కామెర్లు : జ్వరం, అలసట, కడుపు నొప్పి, మూత్రం పచ్చగా రావడం, వికారం, కళ్లు పచ్చబడటం

జనగామలో ఈ సీజన్ లో జ్వరాలు 399 కేసులు, దగ్గు 174 కేసులు. శ్వాసకోశ సమస్యతో 84 కేసులు, చికెన్ గున్యా 1, డెంగ్యూ కేసులు 23 గా నమోదు అయ్యాయి.

జనగామ డీఎమ్ హెచ్ ఓ మల్లికార్జునరావు..

సీజనల్ వ్యాధులకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని అన్నారు. పిల్లలకు ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తల పై సిబ్బందితో తల్లిదండ్రులకు తగు సూచనలు అందిస్తున్నామని, అలాగే దోమల నివారణకు మున్సిపల్ శాఖతో, వైద్య శాఖ సిబ్బందితో కో ఆర్డినేషన్ చేసుకుంటు ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు.

చల్లటి వాతావరణంలో పిల్లలు తిరగకుండా చూడాలి.. డా. లింగమూర్తి, పిల్లల వైద్య నిపుణులు,

చలికాలంలో పిల్లల ఆరోగ్యం పై జాగ్రత్తలు తీసుకోవాలి. శ్వాస సంబంధ సమస్యలు ఎక్కువగా వస్తాయి. జలుబు, తీవ్ర జ్వరంతో పాటు ఆయాసం ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. డాక్టర్‌ని సంప్రదించడంలో నిర్లక్ష్యం చేయకండి. చలికాలంలో పిల్లలకు సర్వసాధారణంగా వచ్చే అనారోగ్యాలు దగ్గు, తుమ్ములు, జలుబు, చర్మం పగలడం. ఇవి చెప్పుకోడానికి, చూడ్డానికి, చిన్నవిగానే అనిపిస్తాయి. దాంతో తల్లిదండ్రులు తమకు తెలిసిన చిన్న చిన్న చిట్కా వైద్యాలను పిల్లల మీద ప్రయోగించే ప్రయత్నం చేస్తారు. వాటితోనే తగ్గిపోతుందనుకుంటారు. కానీ చలికాలంలో పిల్లలకి సోకే వైరస్‌లు మామూలు చిట్కాలకు తగ్గవు. స్వంత వైద్యంతో యాంటి బయోటిక్స్ వాడుతున్నారు అలా చేయకూడదు. చాక్లెట్లు, ఐస్క్రీం, చల్లని పానియాలకు పిల్లలను దూరంగా ఉంచాలని హెచ్చరిస్తున్నారు.

Advertisement

Next Story