- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కలెక్టరేట్ లో జరిగిన అగ్నిప్రమాదంపై విచారణ జరిపించాలి.. గొల్లపల్లి జయరాజు
దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సీపీఓ కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదం పై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఎం సంగారెడ్డి జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అగ్నిప్రమాదం పై పలు అనుమానాలు ఉన్నాయని ప్రమాదం పై విచారణ జరిపించాలని కోరుతూ గురువారం జిల్లా కలెక్టర్ కు మెయిల్ ద్వారా వినతిపత్రం పంపించారు. ఈ సందర్భంగా జయరాజు మాట్లాడుతూ సీపీవో కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం పై పలు రకాల సందేహాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
జిల్లాలో ముఖ్యమైన కార్యాలయంలో జరిగిన అగ్ని ప్రమాదం షార్ట్స్ సర్క్యూట్ వల్ల కార్యాలయంలోని కంప్యూ టర్, ఏసీ, కొన్ని ఫైళ్లు దగ్ధమయ్యాయని, దీని పై పలు రకాలుగా అనుమానంతో పత్రికలలో వార్తలు వస్తున్నాయని వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం ఫై ఉందన్నారు. కార్యాలయ సిబ్బంది ట్యూబ్ లైట్ స్విచ్ వేసిన కాసేపటికి షార్ట్స్ సర్క్యూట్ జరిగిందని అంటున్నారని, దీని పై సమగ్ర విచారణ జరిపిస్తే పూర్తి వివరాలు బయటపడుతాయన్నారు. వెంటనే ప్రభుత్వం కలెక్టరేట్ లో జరిగిన అగ్నిప్రమాదం పై సమగ్ర విచారణ జరిపితే ఏదైనా అవకతవలు జరిగితే బాధ్యుల పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.