- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Chamala: కేటీఆర్ మతిస్థిమితం కోల్పోయారు.. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ ఫైర్
దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ నేతలు(BRS Leaders) అధికారంతో పాటు మతిస్థిమితం కూడా కోల్పోయారని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ(Bhuvanagiri Congress MP) చామల కిరణ్ కుమార్ రెడ్డి(Chamala Kiran Kumar Reddy) అన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ లీడర్లపై ఫైర్ అయ్యారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నేతలు గత పదేళ్ళు ఈగోలకు పోయి తెలంగాణకు తీవ్ర నష్టం చేశారని, వీరి వల్లే తెలంగాణ ఆగమైందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ(Congress Party) అనేది ఒక జాతీయ పార్టీ(National Party) అనే సంగతి మరచిపోయినట్లు ఉన్నారని, అధికారంలో ఉన్నన్ని రోజులు తెలంగాణకు మేమే రాజులం(Kings Of Telangana) అనే ఒక మాయలో బ్రతికారని విమర్శలు చేశారు.
అలాగే ఫాంహౌజ్(Farm House) లో ఉండి అన్ని నడిపిస్తామన్న భ్రమలో ఉండి, కేంద్రం నుంచి తెలంగాణకు నిధులు తేవడంలో విఫలం అయ్యారని దుయ్యబట్టారు. ప్రజలు మరిచిపోవాలి అనుకుంటున్న పదేళ్ల దరిద్రపు పాలనను పదే పదే గుర్తు చేస్తూ.. కాంగ్రెస్ పాలనపై నిందలు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇన్ని సార్లు ఢిల్లీ రావడం వల్లనే విభజన హామీ అయిన వరంగల్ కోచ్ ఫ్యాక్టరీ(Warangal Coach Factory) ఆమోదించబడిందని తెలిపారు. ఆదిలాబాద్(Adilabad)లో వాళ్ళు అనుమతులు ఇచ్చిన ఇథనాల్ ఫ్యాక్టరీ(Ethanol Factory) గురించి వాళ్లే సీఎం రేవంత్ రెడ్డిపై దుష్ప్రచారం చేస్తున్నారని, ప్రతీ విషయంలో ప్రభుత్వాన్ని నిందల పాటు చేయాలని ధ్యేయంగా పెట్టుకున్నారని అన్నారు. అంతేగాక కేటీఆర్ పొలిటీషియన్ అనే విషయం పూర్తిగా మర్చిపోయాడని, ఆయనకి మతి స్థిమితం బాగలేదని ఎంపీ చామల సంచలన వ్యాఖ్యలు చేశారు.