- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
BJP: గురివింద గింజ తరహాలో బీఆర్ఎస్ తీరు.. కేంద్రమంత్రి సంచలన వ్యాఖ్యలు

దిశ, వెబ్ డెస్క్: గురివింద గింజ తరహాలో బీఆర్ఎస్ పార్టీ(BRS Party) వ్యవహరిస్తున్నదని, ఎవరికి ఎవరు దోస్తులనేది తెలంగాణ సమాజానికి(Telangana People) తెలిసిపోయిందని కేంద్ర బోగ్గు, గణుల శాఖమంత్రి కిషన్ రెడ్డి(Union Minister Kishan Reddy) అన్నారు. కేటీఆర్(KTRBRS) చేసిన వ్యాఖ్యలపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. బీఆర్ఎస్ పార్టీపై మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీ తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన వారిని కాంగ్రెస్(Congress) లోకి.. చేతి గుర్తుపై గెలిచిన వారిని గులాబీ పార్టీలోకి పంపించుకుని.. మంత్రిపదవులు తీసుకున్నప్పడు.. ఎవరు? ఎవరితో కలిసినట్లో కేటీఆర్ చెప్పగలరా? అని ప్రశ్నించారు.
అలాగే మేం గిల్లినట్లు చేస్తాము.. మీరు ఏడ్చినట్లు చేయండన్న తెరచాటు ఒప్పందంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. పదేళ్ల పాటు బీఆర్ఎస్ అనుసరించిన మోసపూరిత విధానాలనే ఇవాళ కాంగ్రెస్ కాపీ కొట్టి ఏడాదిగా అనుసరిస్తున్న మాట వాస్తవం కాదా? అని, కాళేశ్వరం(Kaleshwaram), ఫోన్ ట్యాపింగ్(Phone Taping) మొదలైన బీఆర్ఎస్ ప్రభుత్వం(BRS govt)లో జరిగిన కుంభకోణాలు(Scams), కేసుల(Cases) విషయంలో పురోగతి లేకపోవడం.. ఎవరితో ఎవరు కలిసున్నారని చెబుతున్నాయని నిలదీశారు. అంతేగాక రైతులను మోసం చేయడంలో, నిరుద్యోగ యువతను నడిరోడ్డుపై నిలబెట్టడంలో, ప్రజల మధ్య విభేదాలు రెచ్చగొట్టడంలో, హిందూ సమాజాన్ని నిట్టనిలువునా చీల్చడంలో, కుటుంబ పాలనను ప్రోత్సహించడంలో.. అవినీతిని పెంచి పోషించడంలో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాల ఆలోచన, పరిపాలనలో సారూప్యతను చూస్తున్నామని చెప్పారు.
దీన్ని బట్టి చూస్తే ఎవరు, ఎవరి చేతుల్లో ఉన్నారో, ఎవరు సంగీతం వాయిస్తే.. ఎవరు డాన్స్ చేస్తున్నారో ప్రజలకు ఈపాటికే అర్థమైపోయిందని విమర్శలు చేశారు. ఇక బీజేపీ(BJP) ఒక సిద్ధాంతం ఆధారంగా ఎదిగిన పార్టీ అని, జాతీయవాదం, అంత్యోదయ వంటి నినాదాలతో పనిచేసే పార్టీ అని తెలియజేశారు. కుటుంబపాలన, అవినీతి వంటివి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతాలు అని, అందుకే ఎవరికి ఎవరు దోస్తులనేది తెలంగాణ సమాజానికి తెలిసిపోయిందని దుయ్యబట్టారు. రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోతున్న సందర్భంలో.. ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో ఉండాలనుకునే మనస్తత్వాలకు ప్రజలే సరైన బుద్ధి చెబుతారని కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.