Ap News: మూడు నియోజకవర్గాలపై ఫోకస్.. రేపు జగన్ కీలక సమావేశం

by srinivas |   ( Updated:2025-04-23 12:45:14.0  )
Ap News: మూడు నియోజకవర్గాలపై ఫోకస్..  రేపు జగన్ కీలక సమావేశం
X

దిశ, వెబ్ డెస్క్: వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు(Proddutur), తిరుపతి రూరల్(Tirupati Rural), జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు(Venkatagiri Municipality), అనంతపురం జిల్లా కంబదూరుపై మాజీ సీఎం జగన్(Former CM Jagan) ఫోకస్ పెట్టారు. ఇందులో భాగంగా ఆయా ప్రాతాల పార్టీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు తాడేపల్లి వైసీపీ కార్యాలయంలో భేటీ కానున్నారు. పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేయనున్నారు. స్ధానిక సంస్ధల ప్రజాప్రతినిధులతో వరుస సమావేశాలలో భాగంగా వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా వెంకటగిరి మున్సిపాలిటీలు, అనంతపురం జిల్లా కంబదూరు, తిరుపతి రూరల్‌ వైఎస్సార్‌సీపీ నేతలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశానికి ఎంపీపీలు, మున్సిపల్‌ చైర్‌ పర్సన్లు, మున్సిపల్‌ వైస్‌ ఛైర్ పర్సన్లు, కౌన్సిలర్లు, ఎంపీటీసీలను ఆహ్వానించారు. వీరితో పాటు ఆయా జిల్లాలకు సంబంధించిన పార్టీ ముఖ్య నాయకులు కూడా హాజరుకానున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో ఓటమితో తీవ్ర నిరాశలో ఉన్న పార్టీ నాయకుల్లో వైసీపీ అధినేత జగన్ ధైర్యం నింపుతున్నారు. మరో నాలుగేళ్లు కళ్లు మూసుకుంటే ఎన్నికలు వస్తాయని, ఈ సారి గెలుపు తమదేనని, అప్పటి వరకు అందరూ పార్టీ కోసం పని చేయాలని సూచిస్తున్నారు. ఇప్పటికే పలు నియోజకవర్గాల నేతలతో ఆయన భేటీ అయ్యారు. స్థానికంగా పార్టీ బలోపేతం కోసం పని చేయాలని, వారికి మంచి అవకాశాలుంటాయని సూచించారు. గురువారం కూడా ఆయా నియోజకవర్గాల నేతలతో జగన్ కలవనున్నారు. పార్టీ బలోపేతం, వచ్చే ఎన్నికల్లో గెలుపుపై దిశానిర్దేశం చేయనున్నారు.



Next Story

Most Viewed