Terror Attack : ఉగ్రదాడి ఎఫెక్ట్... రాష్ట్రాన్ని వీడుతున్న వేలమంది టూరిస్టులు

by M.Rajitha |
Terror Attack : ఉగ్రదాడి ఎఫెక్ట్... రాష్ట్రాన్ని వీడుతున్న వేలమంది టూరిస్టులు
X

దిశ, వెబ్ డెస్క్ : జమ్ముకాశ్మీర్లోని(Jammu Kashmir) పహల్గామ్(Pahalgoan) లో మంగళవారం ఉగ్రవాదులు టూరిస్టుల మీద కాల్పులు(Terror Attack) జరిపిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో 28 మంది మరణించగా.. మరో 20 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ భీకర ఉగ్రదాడికి వణికిపోయిన పర్యాటకులు కాశ్మీర్ ను వీడుతున్నారు. బుధవారం కేవలం 6 గంటల్లోనే 2 ఓ విమానాల్లో 3400 మంది ప్రయాణికులు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోయారు. శ్రీనగర్ ఎయిర్పోర్టులో పర్యాటకుల రద్దీ పెరగడంతో.. వారికి విమానాశ్రయ సిబ్బంది ఆహారం, నీళ్ళు అందించారు.

ప్రయాణికులను చెరవేసేందుకు మరిన్ని ఫ్లైట్లు అందుబాటులో ఉంచుతామని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కాగా జమ్ము కాశ్మీర్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఆ రాష్ట్ర సీఎం ఒమర్ అబ్దుల్లా(CM Omar Abdullah) స్పందించారు. పర్యాటకులు రాష్ట్రాన్ని వీడుతుంటే బాధగా ఉందన్నారు. అయినప్పటికీ వారి పరిస్థితిని అర్థం చేసుకోగలను అని తెలిపారు. అదనపు విమానాలతోపాటు రోడ్డు మార్గంలోనూ పర్యాటకులకు రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నట్టు వెల్లడించారు.



Next Story

Most Viewed