ఏసీబీ వలలో విద్యుత్ శాఖ ఏఈ

by Aamani |
ఏసీబీ వలలో విద్యుత్ శాఖ ఏఈ
X

దిశ, మహబూబ్ నగర్ బ్యూరో : ఉమ్మడి పాలమూరు జిల్లాలో మరో అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కారు. వివరాల్లోకి వెళితే.. ఖిల్లా గణపురం మండల విద్యుత్ శాఖ ఏఈ గా పనిచేస్తున్న కొండయ్య ఖిల్లా ఘనపురం మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామంలోని తిరుమల ఆగ్రో ఇండస్ట్రీస్ కు విద్యుత్ కనెక్షన్ ఇప్పించేందుకురూ. 40 వేల రూపాయలు కాంట్రాక్టర్ ను డిమాండు చేసినట్లు సమాచారం . కంపెనీకి సంబంధించి పనులు పూర్తిచేసిన కాంట్రాక్టర్ విద్యుత్ కనెక్షన్ ఇచ్చేందుకు మరో రూ,10 వేలు ఇవ్వాలి అని ఏఈ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు అవినీతి నిరోధక శాఖ అధికారులకు సంబంధిత కాంట్రాక్టర్ సమాచారం ఇచ్చాడు. వనపర్తి డి ఈ కార్యాలయంలో బుధవారం లంచం తీసుకుంటూ ఉండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆకస్మికంగా దాడులు చేసి అతడి నుండి డబ్బులు స్వాధీన పరచుకొని.. వేలిముద్రలు తీసుకున్నారు. ఈ మేరకు కొండయ్య పై కేసు నమోదు చేసి సంబంధిత అవినీతి నిరోధక శాఖ అధికారులు హైదరాబాద్ నాంపల్లి కోర్టులో ప్రవేశ పెట్టేందుకు తీసుకువెళ్లారు. మధ్యాహ్నం రెండు గంటల తర్వాత జరిగిన ఈ సంఘటన ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది.


Next Story

Most Viewed