- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన గౌతమ్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు

దిశ, హనుమకొండ: తెలంగాణ ఇంటర్మీడియట్ 2025 ఫలితాలలో గౌతమ్ జూనియర్ కాలేజ్ విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు. గౌతమ్ జూనియర్ కాలేజ్ డైరెక్టర్ అంభీర శ్రీకాంత్ మాట్లాడుతూ.. మా పిల్లలు లక్షలు ఖర్చు చేయలేదు, ఎలాంటి ఒత్తిడికి గురి కాకుండా కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ఫలితాలు సాధించడం జరిగింది. ఎమ్‌పీసిలో ఆడెపు సౌమ్య 993/1000, బై పి సి లో పూజారి శరణ్య 993/1000, నాగపూరి హాసిని 990/1000,కందుల అభినయ 990/1000 మార్కులు సాధించినట్లు తెలిపారు. ఎమ్‌పీసి మొదటి సంవత్సరంలో గజనవేణి సంజన 466/470, బండారి కావ్య 466/470, గజెల్లీ వైష్ణవి 466, బింగి శ్రావణి 466, వంగల శ్రావణి 465 మార్కులు, బైపీసీ మొదటి సంవత్సరంలో సామల రుషిత 434/440, సి ఈ సి మొదటి సంవత్సరంలో తోడేటి శ్రీయుత్ 462/500 ఉత్తమ ఫలితాలు సాధించారు. ఇంతటి ఘన విజయానికి కారకులైన మా బోధన, మా బోధనేతర సిబ్బందికి, విద్యార్థులకు, తల్లిదండ్రులకు గౌతమ్ జూనియర్ కాలేజ్ డైరెక్టర్స్ సందరాజు సంతోష్, మంతెన బిక్షపతి , గొట్టె లక్ష్మణ్ , బండి పరుశరామ్, ఆరెల్లి ధనుంజయ్‌లు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.