- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పీహెచ్ సీ ఏర్పాటు కోసం స్థల పరిశీలన..
దిశ, కొత్తూరు : ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మండల కేంద్రానికి దూరంగా ఉండడంతో సామాన్య ప్రజలకు ఉచిత వైద్యం అందని ద్రాక్షగా మారింది. గతంలో వివిధ పత్రికలలో వచ్చిన కథనాలకు స్పందించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ కొత్తూరు ప్రాథమిక ఆరోగ్య వైద్య కేంద్రాన్ని మండల కేంద్రంలోకి మార్చాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహకు వినతి పత్రాన్ని అందజేశారు. అప్పట్లో వెంటనే స్పందించిన మంత్రి సత్వరమే పీహెచ్సీని మండల కేంద్రానికి మార్చాలని అధికారులను ఆదేశించారు. దీంతో గురువారం జిల్లా స్థాయి అధికార యంత్రాంగం మండల కేంద్రంలో పర్యటించారు. పీహెచ్సీ ఏర్పాటు కోసం అనువైన స్థలాలను పరిశీలించారు.
మున్సిపల్ కౌన్సిలర్ హేమా దేవేందర్ వీరికి మండల కేంద్రంలో అక్కడక్కడా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని చూపించారు. ప్రస్తుతం మండల కేంద్రానికి దూరంగా ఉన్న పీహెచ్సీకి వెళ్లాలంటే గర్భిణులు, మండల ప్రజలు, స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని వీలైనంత తొందరగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మండల కేంద్రంలోకి మార్చాలని అధికారులను కౌన్సిలర్ కోరారు. దీంతో సానుకూలంగా స్పందించిన డీఎంహెచ్ఓ డా.బి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వీలైనంత తొందరగా ఈ సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. విజయలక్ష్మి, మండల వైద్యాధికారి డా. హరికిషన్ హెల్త్ ఎడ్యుకేటర్ జే శ్రీనివాస్, సీహెచ్ఓ నాగేశ్వర్ తదితరులు ఉన్నారు.