- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దొంగతనం కేసులో వ్యక్తి అరెస్టు
by Sridhar Babu |
X
దిశ,బెల్లంపల్లి : మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో దొంగతనం కేసులో పోలీసులు ఒకరిని అరెస్టు చేశారు. సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. ముత్యంపల్లి గ్రామానికి చెందిన బోడకుంట శ్యాంసుందర్ కుటుంబ సభ్యులు ఇంట్లో లేని సమయంలో ఈనెల 27న గుర్తుతెలియని దొంగలు ఇంట్లో ప్రవేశించి బీరువా నుండి రూ 80 వేలు దొంగిలించారు.
దొంగతనం జరిగినట్లు శ్యాంసుందర్ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నమ్మదగిన సమాచారం మేరకు ఇవాళ మధ్యాహ్నం నిందితుడు ముత్యంపల్లి గ్రామానికి చెందిన దాడి సాయి తేజను సోమగుడం ఎక్స్ రోడ్ వద్ద పట్టుకున్నారు. నిందితుడి నుంచి ఓ మొబైల్ ఫోను, క్యాష్ ను సీజ్ చేసి జ్యుడీషియల్ రిమాండ్ కు పంపించారు.
Advertisement
Next Story