ఆ సమయంలో అప్రమత్తతే మన ఆయుధం..!.. తెలంగాణ పోలీస్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Goud |
ఆ సమయంలో అప్రమత్తతే మన ఆయుధం..!.. తెలంగాణ పోలీస్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: సైబర్ నేరగాళ్లు ప్రజల బలహీనతనే ఆయుధంగా చేసుకొని కొత్త పుంతలు తొక్కుతూ.. సైబర్ నేరాలకు పాల్పడుతున్నారు. కొందరు జాబ్ ఆఫర్ ఇస్తామని కాల్ చేస్తే.. మరికొందరు లాటరీ వచ్చిందంటూ స్కామ్ చేస్తున్నారు. ఇంకొందరు మీ పర్సనల్ డేటా మా దగ్గర ఉందంటు బురిడీ కొట్టిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో కొత్త రకం మోసంతో ప్రజల మధ్యకు వస్తున్నారు. వీటిపై పోలీసులు నిత్యం ఏదో ఒక విధంగా అవగాహాన కల్పిస్తూనే ఉన్నా.. సైబర్ నేరాలు మాత్రం ఆగడం లేదు. ఈ నేపధ్యంలోనే సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహాన కల్పించేలా కొరియర్/పార్సిల్ పేరుతో జరిగే మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో మీ పేరుపై కొరియర్ వచ్చిందని అందులో నిషేధిత డ్రగ్స్/వస్తువులు ఉన్నాయని నమ్మబలికి, పోలీసుల వేషంలో వీడియో కాల్స్ చేసి డబ్బు డిపాజిట్ చేయకపోతే అరెస్ట్ చేస్తామని భయపెడతారని పోస్ట్ చేశారు. దీనిపై కొరియర్/పార్సిల్ పేరుతో జరిగే సైబర్ మోసాల పట్ల, కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాలకు బాధితులుగా మారితే గందరగోళానికి గురవకుండా వెంటనే 1930 అనే నంబర్ కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని అన్నారు. అప్రమత్తతే మన ఆయుధం అని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.

Advertisement

Next Story

Most Viewed