యూపీ సీఎం యోగీ ఆధిత్యానాధ్ కు రాహుల్ గాంధీ బహిరంగ లేఖ!

by Ramesh Goud |   ( Updated:2024-07-07 07:46:07.0  )
యూపీ సీఎం యోగీ ఆధిత్యానాధ్ కు రాహుల్ గాంధీ బహిరంగ లేఖ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హత్రాస్‌లో తొక్కిసలాట ప్రమాదంలో బాధిత కుటుంబాలను పరామర్శించిన ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ కి బహిరంగ లేఖ రాశారు. యూపీలోని హత్రాస్ జిల్లాలో రాహుల్ గాంధీ శనివారం పర్యటించారు. హత్రాస్ ఘటనలో చనిపోయిన, గాయపడిన బాధిత కుటుంబాలను పరామర్శించి, వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఈ ఘటనలో బాధితులకు నష్టపరిహారంపై సీఎం యోగీకి లేఖ రాశారు. ఈ లేఖలో హత్రాస్‌లో జరిగిన తొక్కిసలాట ప్రమాదంలో 120 మందికి పైగా మరణిచారనేది తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసిందని, బాధతో ఈ లేఖ రాస్తున్నానని తెలిపారు. అలీఘర్, హత్రాస్ జిల్లాల బాధిత కుటుంబాలను పరామర్శించి, వారి బాధలను తెలుసుకోవడానికి ప్రయత్నించానని, ఆ సమయంలో వారిని ఓదార్చడానికి కూడా మాటలు రాలేదని చెప్పారు.

ఈ ప్రమాదంలో కోల్పోయిన వాటిని భర్తీ చేయడం సాధ్యం కాదు. కానీ బాధిత కుటుంబాలకు సహాయం చేయడం ద్వారా వారి బాధలను కొంత తగ్గించవచ్చు. ఈ ఘటనలో యూపీ ప్రభుత్వం ప్రకటించిన పరిహారం సరిపోదు. నష్టపరిహారం మొత్తాన్ని పెంచి వీలైనంత త్వరగా అందించాలని సీఎంకు విన్నవించారు. అలాగే ప్రమాదంలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించి, వారికి కూడా తగిన పరిహారం అందించాలని కోరారు. ఈ ఘటనలో స్థానిక యంత్రాంగం నిర్లక్ష్యం కూడా కారణమని బాధిత కుటుంబాలు తనతో చెప్పాయని, ఈ కేసులో దర్యాప్తు పారదర్శకంగా జరిపి దోషులకు కఠిన శిక్ష పడే విధంగా చూడాలని, భవిష్యత్తు లో ఇలాంటి ఘటనలు జరగకుండా నిరోధించాలని రాహుల్ గాంధీ లేఖ ద్వారా తెలియజేశారు.







Advertisement

Next Story

Most Viewed