కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ.. ‘బాలుడు’ అంటూ రాహుల్‌ గాంధీపై మాస్ సెటైర్

by Satheesh |   ( Updated:2024-07-02 12:07:57.0  )
కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ.. ‘బాలుడు’ అంటూ రాహుల్‌ గాంధీపై మాస్ సెటైర్
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోడీ ఫైర్ అయ్యారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా మంగళవారం లోక్ సభలో మోడీ మాట్లాడుతూ.. 2024 లోక్ సభ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి మూడో అతిపెద్ద పరాజయం అని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ మళ్లీ ప్రతిపక్షంలోనే కూర్చొవాలని ప్రజలు తీర్పు ఇచ్చారని, మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ 100 సీట్లలోపే పరిమితమైందని సెటైర్ వేశారు. ప్రజల నిర్ణయంపై ఆత్మ పరిశీలన చేసుకోకుండా కాంగ్రెస్ నేతలు ఇంకా చిన్నపిల్లలానే ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలు ఎన్డీఏను ఓడించామని భావిస్తున్నారు. 99 మార్కులు వచ్చాయని ఓ బాలుడు (రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ) సంతోపడుతున్నాడు. కానీ వచ్చింది 100కు 99 మార్కులు కాదని 543కు 99 మార్కులు వచ్చాయని ఎద్దేశా చేశారు. 13 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు సున్నా సీట్లు వచ్చాయని అన్నారు.

సున్నా సీట్లు వచ్చినా.. కాంగ్రెస్ వాళ్లు హీరోల్లా ఫీలవుతున్నారని ఎద్దేవా చేశారు. పరాజయాల్లో కాంగ్రెస్ పార్టీ రికార్డ్ సృష్టించిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేరుగా పోటీ పడ్డ స్థానాల్లో కాంగ్రెస్ స్ట్రైయిక్ రేట్ కేవలం 26 పర్సంటేనని అన్నారు. గుజరాత్, ఛత్తీస్ గఢ్‌, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ సొంతంగా పోటీ చేసింది. ఈ మూడు రాష్ట్రాల్లో ఆ పార్టీ గెలిచింది కేవలం రెండు స్థానాలేనని గుర్తు చేశారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ సారి బీజేపీ ప్రజల ప్రేమను పొందిందని, ఇందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీఏ కూటమి క్లీన్ స్పీప్ చేసిందని పేర్కొన్నారు. కర్నాటక, యూపీ, తమిళనాడు, రాజస్థాన్‌లోనూ బీజేపీ ఓటు శాతం పెరిగిందని చెప్పారు. కాగా, ఇటీవల జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ 99 ఎంపీ సీట్లు గెలిచిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story