- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Collector Rahul Raj : వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే రోగాలు దరిచేరవు
దిశ, నర్సాపూర్ : వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. స్థానిక నర్సాపూర్ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి , వైద్యులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో రోగుల తో మాట్లాడారు. ఎక్కడ నుంచి వచ్చారు? ఎన్ని రోజులు నుంచి హాస్పిటల్ లో ఉంటున్నారు? ఏం జబ్బు వచ్చింది ? ఏం మందులు వాడుతున్నారు? ఇంకా ఎన్ని రోజులు వైద్యులు ఉండమంటున్నారు అంటూ ప్రతి రోగి దగ్గరికి వెళ్లి పలకరించారు. వైద్య సేవలు ఎలా అందుతున్నావి, హాస్పిటల్లో ఏదైనా సమస్యగా ఉందా? అంటూ అన్ని వార్డులో ఉన్న రోగులను వివరాల అడిగి తెలుసుకున్నారు. మెడికల్ స్టోర్ రూమును పరిశీలించి సిబ్బందిని మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో మందుల కొరత లేకుండా చూడాలన్నారు. జిల్లాలో కేవలం మూడు తీవ్ర జ్వరం కేసులు మాత్రమే ఉన్నాయని, అవి కూడా తగ్గుముఖం పట్టాయని తెలిపారు. అంటూ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని వైరల్ ఫీవర్, డెంగీ, మలేరియా లాంటివి రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. గుంతలలో మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి అని ఆయన అన్నారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో దోమల వ్యాప్తిని అరికట్టడానికి కిరోసిన్, క్రూడ్ ఆయిల్ ను చల్లడం ద్వారా దోమలను నివారించవచ్చని ఆయన చెప్పారు. అల్పాహారం వేడి చేసిన భోజనం తీసుకోవాలన్నారు. నిల్వ చేసిన పదార్థాలు బయట తినుబండాలకు దూరంగా ఉండి ప్రజల ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో నర్సాపూర్ ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ మీర్జా బేగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.