- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
దీపావళి రోజున కూడా మగువలకు షాకిచ్చిన పసిడి.. బంగారం భారమాయెనే..
దిశ, వెబ్ డెస్క్: పండుగలు, పెళ్లిళ్ల సీజన్ మొదలైందంటే చాలు. బంగారం (Gold Price on Diwali) ధరలకు రెక్కలొస్తాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల్లో జరిగే మార్పులే ఇందుకు కారణం. దీపావళికి బంగారం కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతాయి. ధన త్రయోదశి నాడు బంగారం ధర ఎక్కువగా కొనుగోలుదారులు మాత్రం వెనక్కి తగ్గేదే లే అన్నారు. కానీ.. సామాన్యులకు మాత్రం బంగారం ధర అందని ద్రాక్షగా కనిపిస్తోంది. కార్తీకమాసంలో పెళ్లిళ్ల ముహూర్తాలున్నాయి. శుభకార్యాలకు గోల్డ్ కొనాలనుకునేవారికి నిరాశే ఎదురవుతోంది. దీపావళి రోజు కూడా బంగారం ధర పెరిగింది.
22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 150 రూపాయలు పెరగ్గా.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములపై 170 రూపాయలు పెరిగింది. హైదరాబాద్ లో నేడు (October 31st gold Price) 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.74,400 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.81,160గా ఉంది. ఇక 18 గ్రాముల బంగారం 10 గ్రాముల ధర రూ.60,870గా ఉంది.
స్థిరంగానే వెండి ధర
బంగారం ధర పెరిగినా వెండి ధర స్థిరంగానే ఉంది. అయినా లాభం లేదు. కిలో వెండి ఇంకా లక్ష రూపాయలకు పైగానే ఉంది. నేడు కిలో వెండి ధర రూ.1,09,000గా ఉంది. సుమారు 15 రోజుల క్రితం లక్షమార్కుకు చేరిన వెండి.. అక్కడి నుంచి దిగిరానంటోంది. అక్టోబర్ 23న లక్షా 12 వేల మార్క్ ను తాకిన తెల్లబంగారం.. ఆ తర్వాత రెండ్రోజుల్లో రూ.5 వేలు తగ్గింది. నిన్న మళ్లీ 2 వేలకు పైగా పెరగడంతో లక్షా 9 వేలుకు చేరింది.