Arvind Kejriwal :మహిళలు, వృద్ధుల స్కీంలపై కేజ్రీవాల్ కీలక ప్రకటన

by Hajipasha |
Arvind Kejriwal :మహిళలు, వృద్ధుల స్కీంలపై కేజ్రీవాల్ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో : 18 ఏళ్లకు పైబడిన మహిళలకు ప్రతినెలా రూ.1,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందించే ‘ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన’ స్కీంపై ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) కీలక ప్రకటన చేశారు. ఈ స్కీంకు సంబంధించిన దరఖాస్తులను సోమవారం నుంచి ఇంటింటికి వెళ్లి ఆప్ వలంటీర్లు స్వీకరిస్తారని వెల్లడించారు. వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో జరగనున్న ఢిల్లీ(Delhi) అసెంబ్లీ ఎన్నికల్లో తాము మళ్లీ గెలిస్తే ఈ మొత్తాన్ని రూ.1,000 నుంచి రూ.2,100కు పెంచుతామని కేజ్రీవాల్ తెలిపారు.

ఆదివారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈవివరాలను ఆయన చెప్పారు. ఈ స్కీంకు అప్లై చేసేందుకుగానూ ఓటరు గుర్తింపు కార్డును చూపిస్తే సరిపోతుందన్నారు. 60 ఏళ్లకు పైబడిన వారికి ఉచిత చికిత్సను అందించేందుకు ఉద్దేశించిన సంజీవని యోజనకు కూడా సోమవారం నుంచే ఇంటింటికి వెళ్లి దరఖాస్తులను స్వీకరిస్తామని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

Advertisement

Next Story

Most Viewed