NALCO Recruitment: నేషనల్ అల్యూమినియం కంపెనీలో ఉద్యోగ అవకాశాలు.. పోస్టులు, అర్హత తదితర వివరాలివే..!

by Maddikunta Saikiran |
NALCO Recruitment: నేషనల్ అల్యూమినియం కంపెనీలో ఉద్యోగ అవకాశాలు.. పోస్టులు, అర్హత తదితర వివరాలివే..!
X

దిశ,వెబ్‌డెస్క్: ఒడిశా(Odisa) రాష్ట్రం భువనేశ్వర్(Bhubaneswar)లోని భారత ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్(NALCO) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 518 నాన్- ఎగ్జిక్యూటివ్ కేడర్(Non-Executive Cadre) పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://nalcoindia.com/ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. డిసెంబర్ 31 నుంచి జనవరి 21 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది.

పోస్టులు, ఖాళీలు:

నాన్- ఎగ్జిక్యూటివ్ - 518

విద్యార్హత:

పోస్టును అనుసరించి సంబధిత విభాగంలో 10th క్లాస్, ఇంటర్మీడియెట్, ఇటీఐ, డిప్లొమా, బీఎస్సీ పూర్తి చేసి ఉండాలి.

ఎంపిక ప్రక్రియ:

కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ట్రేడ్ టెస్ట్, మెడికల్ టెస్ట్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఆధారంగా అభ్యర్థులను సెలెక్ట్ చేస్తారు.

వయోపరిమితి:

27 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.

దరఖాస్తు రుసుము:

జనరల్/ ఈడబ్ల్యూఎస్/ ఓబీసీ అభ్యర్థులకు రూ. 100, మిగతా కేటగిరీ వారికి ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

Advertisement

Next Story