- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Fake Kidnap : కుటుంబాన్ని టెస్ట్ చేసేందుకు కిడ్నాప్ డ్రామా.. దొరికిపోయిన యువకుడు
దిశ, నేషనల్ బ్యూరో : కుటుంబ సభ్యులకు తనపై ఎంత ప్రేమ ఉందో చెక్ చేసేందుకు ఉత్తరప్రదేశ్(UP)లోని కుశినగర్‌కు చెందిన 22 ఏళ్ల అనూప్ పటేల్ కిడ్నాప్ అయినట్టు నటించాడు. తనను ఒక ఆటో డ్రైవర్ కిడ్నాప్(Fake Kidnap) చేయించాడని లక్నో జిల్లా గోమతి నగర్ పోలీసు స్టేషనుకు ఫోన్ చేసి చెప్పాడు. గోమతీ నగర్ రైల్వే స్టేషను సమీపంలో తాను కిడ్నాప్‌కు గురైనట్లు తెలిపాడు. ఈ సమాచారం నిజమేనని భావించి పోలీసులు ప్రత్యేక టీమ్‌ను రంగంలోకి దింపారు. అనూప్ పటేల్ ఫోన్ నంబరు ఆధారంగా అతడి లొకేషన్‌ను పోలీసులు ట్రాక్ చేశారు. అక్కడికి పోలీసుల టీమ్ చేరుకోగా.. అనూప్ కులాసాగా కూర్చొని ఉన్నాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయాన్ని వెల్లడించాడు.
‘‘నేను రైల్వే టెక్నీషియన్ పరీక్ష రాసేందుకు కుశినగర్ నుంచి లక్నోకు వచ్చాను. గోమతి నగర్‌కు చేరుకోగానే నాకు ఒక ఐడియా వచ్చింది. నాపై నా కుటుంబానికి ఎంత ప్రేమ ఉందో టెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నాను. అందుకోసమే కిడ్నాప్ నాటకం ఆడాను’’ అని పోలీసులకు అనూప్ వెల్లడించాడు. ‘‘పోలీసులకు అనూప్ తప్పుడు సమాచారాన్ని ఇచ్చాడు. తద్వారా చట్టాన్ని ఉల్లంఘించాడు. సొంత కుటుంబం ప్రతిష్ఠను దెబ్బతీసుకున్నాడు’’ అని గోమతి నగర్ పోలీసులు తెలిపారు. అందుకే అతడిని అరెస్టు చేశామని వెల్లడించారు.