అమీన్ పూర్ మున్సిపాలిటీ కార్యాలయం పై ఏసీబీ సోదాలు..

by Kalyani |
అమీన్ పూర్ మున్సిపాలిటీ కార్యాలయం పై ఏసీబీ సోదాలు..
X

దిశ,పటాన్ చెరు : అమీన్ పూర్ మున్సిపాలిటీ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడి చేశారు. అమీన్ పూర్ మున్సిపాలిటీలో ఇటీవల విలీనమైన గ్రామాలలో ఇంటి అనుమతులతో పాటు నిధుల అవకతవకలపై అందిన ఫిర్యాదుపై ఏసీబీ అధికారులు మున్సిపల్ కార్యాలయంలో సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఐలాపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శిగా పనిచేసిన సచిన్ ని అదుపులోకి తీసుకున్న ఏసీబీ అధికారులు ఐలాపూర్ పంచాయతీ రికార్డుల అవకతవకలపై విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఈ సోదాల విషయంలో ఏసీబీ అధికారులు మరికాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది.

👉 Dishadaily Web Stories

Advertisement

Next Story

Most Viewed