Makhana Board : బిహార్‌కు మఖానా బోర్డు ... బడ్జెట్‌లో కీలక ప్రకటన

by vinod kumar |
Makhana Board : బిహార్‌కు మఖానా బోర్డు ... బడ్జెట్‌లో కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) బిహార్ రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. రాష్ట్రంలో మఖానా బోర్డు (Makhana board) ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. మఖానా ఉత్పత్తిని ప్రోత్సహించి రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ప్రత్యేక మఖానా బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు. అంతేగాక మఖానాను పండించే రైతులకు సాంకేతిక సాయం, ఆర్థిక సాయం సైతం అందించనున్నారు. దీని ద్వారా మఖానా రైతుల ఆదాయం పెరుగుతుందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. బిహార్ దేశంలోనే మఖానా ఉత్పత్తిలో అతిపెద్ద కేంద్రంగా ఉంది. కానీ ఇప్పటి వరకు దీనిని మరింత ప్రోత్సహించడానికి ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ప్రభుత్వం తీసుకున్న ఈ చర్య మఖానా పరిశ్రమకు ఊతమిస్తుందని, రైతులకు గిట్టుబాటు ధర లభించే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

కాగా, మఖానా అనగా ఇదొక రకమైన ఆహారం. ఇవి ఆకుల మాదిరిగా ఉండి గింజలాంటి నిర్మాణంలో ఉంటాయి. చాలా ఏళ్లుగా బిహార్ లో దీనిని పండిస్తున్నారు. దేశంలో 90 శాతం మఖానాను బిహార్‌లో మాత్రమే ఉత్పత్తి చేస్తారు. ఉత్తర బిహార్ ప్రాంతంలో అధికంగా పండిస్తారు. దీంతో ఆ ప్రాంతానికి మఖానా ప్రాంతం అపే పేరు కూడా వచ్చింది. బడ్జెట్‌లో చేసిన ఈ ప్రకటనతో ఈ రంగంలో కొత్త ఉపాధి అవకాశాలు కూడా ఏర్పడనున్నాయి. మఖానాకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ప్రభుత్వం దాని ఉత్పత్తిని మరింత ప్రోత్సహించాలని యోచిస్తోంది.


Next Story