నా కూతురు విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను

by Ajay kumar |   ( Updated:2025-03-05 17:59:49.0  )
నా కూతురు విషయం తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యాను
X

- కర్ణాటక డీజీపీ రామచంద్రరావు

దిశ, నేషనల్ బ్యూరో: దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తూ తన కూతురు రన్యా రావు పట్టబడిన విషయం మీడియాలో చూసి తెలుసుకున్నానని కర్ణాటక డీజీపీ (రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్) రామచంద్రరావు అన్నారు. ఈ సంఘటన తన దృష్టికి వచ్చినప్పుడు షాక్‌కు గురయ్యాను. నాకు ఈ విషయాలేవీ తెలియదు అన్నారు. అందరు తండ్రుల్లాగే తాను కూడా దిగ్భ్రాంతికి గురయ్యానని రామచంద్రరావు చెప్పారు. తన కూతురు ఇలాంటి పని చేస్తుందని తనకు ముందుగా అసలు ఏమీ తెలియదని స్పష్టం చేశారు. ప్రస్తుతం రన్యారావు తనతో ఉండటం లేదని.. తన భర్తతో విడిగా కలిసి ఉంటోందని రామచంద్రరావు తెలిపారు. తన కూతురు, అల్లుడి మధ్య ఏవైనా కుటుంబ సభ్యులు ఉన్నాయేమో.. ఏదేమైనా చట్టం తన పని తాను చేసుకొని పోతుందని రామచంద్రరావు చెప్పారు. నా కెరీర్‌లో ఎలాంటి మచ్చా లేదని.. ఈ విషయంలో తాను ఇక చెప్పడానికి ఏమీ లేదని రామచంద్రరావు అన్నారు.

కాగా కన్నడ నటి, డీజీపీ కూతురు రన్యారావు దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం రవాణా చేస్తుండగా సోమవారం బెంగళూరులోని కెంపెగౌడ విమానాశ్రయంలో డీఆర్ఐ అధికారులు పట్టుకున్నారు. తరచూ దుబాయ్ పర్యటనకు వెళ్లి.. తిరుగు ప్రయాణంలో భారీగా బంగారాన్ని తీసుకొని వస్తున్నదని.. పోలీస్ ఎస్కార్ట్ సాయంతో భద్రతా తనిఖీల నుంచి తప్పించుకుందని డీఆర్ఐ అధికారులు తెలిపారు. సోమవారం దుబాయ్ నుంచి బెంగళూరుకు ఎమిరేట్స్ విమానంలో వచ్చిన ఆమె దగ్గర రూ.12.56 కోట్ల విలువైన బంగారం కడ్డీలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం డీఆర్ఐ అదుపులో ఉన్న రన్యా రావును మరింత లోతుగా విచారిస్తున్నారు.



Next Story