- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
Global warming: గ్లోబల్ వార్మింగ్ అదుపులో ఉండాలంటే అదొక్కటే మార్గం.. కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్

దిశ, నేషనల్ బ్యూరో: గ్లోబల్ వార్మింగ్ (Global warming) ను 1.5 డిగ్రీల సెల్సియస్‌లోపు ఉంచడం ఇప్పటికీ సాధ్యమేనని, అయితే దీనికి అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థిక, సాంకేతిక మద్దతు అందించాల్సి ఉంటుందని కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ (Bhupender Yadav) అన్నారు. బుధవారం ఆయన ప్రపంచ సుస్థరాభివృద్ధి సదస్సులో ప్రసంగించారు. ప్రస్తుత బహుపాక్షిక వ్యవస్థ వాతావరణ మార్పుల వంటి ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో విఫలమవుతోందని విమర్శించారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణ చర్చలకు కేంద్రంగా ఉండేలా తక్షణ సంస్కరణలు అవసరమని నొక్కి చెప్పారు. ‘ గ్లోబర్ వార్మింగ్‌ను1.5-డిగ్రీల సెల్సియస్ లోపు నియంత్రించడం ఇప్పటికీ సాధ్యమే. సౌరశక్తి, పవన శక్తి, అడవులు ఉద్గారాలను గణనీయంగా తగ్గించడానికి అపారమైన సామర్థ్యాన్ని అందిస్తున్నాయి. అయితే దీనిని పూర్తిగా వినియోగించకోవడానికి అత్యవసర చర్యలు తీసుకోవాలి. అభివృద్ధి చెందిన దేశాలు తమ హామీలను నిలబెట్టుకోవాలి’ అని వ్యాఖ్యానించారు.
వాతావరణ ప్రమాదాలను పరిష్కరించకపోతే, పర్యావరణ సంబంధిత అంతరాయాల కారణంగా 2070 నాటికి భారతదేశం తన జీడీపీలో 24.7 శాతం కోల్పోవచ్చని ఆసియా అభివృద్ధి బ్యాంకు తయారుచేసిన నివేదికను ఆయన గుర్తు చేశారు. గ్లోబల్ సౌత్ వాతావరణ ఎజెండాను నడుపుతోందని, ఈ విషయం లో ప్రపంచం మొత్తం భారతదేశాన్ని నాయకుడిగా చూస్తుందని కొనియాడారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి దేశంలోని ప్రయివేట్ రంగం సైతం ముందుకు రావాలని, ఈ దిశగా ఆవిష్కరణలు చేసి పరిష్కారాలను కనుగొనాలని సూచించారు. ఈ అంశంలో పరిశోధనా సంస్థలతో సహకరించాలని కోరారు.