- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
అతనిది హత్యా లేక ఆత్మహత్య...

X
దిశ, సంగారెడ్డి అర్బన్ : ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా కంది మండల పరిధిలోని కలివేముల గ్రామంలో శనివారం వెలుగులోకి వచ్చింది. గ్రామంలోని పాత బావి సమీపంలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెంది ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ విజయ్ కుమార్ క్లూస్ టీం ఆధారంగా వివరాలను సేకరిస్తున్నారు. మృతుడి వయసు 35 నుంచి 40 మధ్యలో ఉంటుందని తెలిపారు.
అయితే సంఘటనా స్థలం వద్ద ఒక మందు బాటిల్, 3 గ్లాసులు కనిపిస్తుండడంతో అతడిని ఎవరైనా హత్య చేసి ఉంటారా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మృతదేహాన్ని పరిశీలించిన ఎస్సై ఏదైనా విషయం లాంటి పదార్థం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ప్రాథమిక అంచనాకు వచ్చారు. ఎవరైనా అతడి ఆచూకీ గుర్తిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు.
Next Story