Union Budget-2025-26: పప్పు ధాన్యాల కోసం ప్రత్యేక ప్రణాళిక.. లోక్‌సభలో నిర్మలా సీతారామన్

by Shiva |
Union Budget-2025-26: పప్పు ధాన్యాల కోసం ప్రత్యేక ప్రణాళిక.. లోక్‌సభలో నిర్మలా సీతారామన్
X

దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభలో కేంద్ర అర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ (Finance Minister Nirmala Seetharaman) 2025-26 బడ్జెట్ (Union budget 2025)ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో వెనుకబడిన జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం కల్పిస్తామని అన్నారు. ముఖ్యంగా గోదాములు, నీటి పారుదల, రుణ సదుపాయాలను పుష్కలంగా కల్పిస్తామని అన్నారు. పప్పు ధాన్యాల కోసం ఆరు సంవత్సరాల ప్రణాళికను రూపొందించామని అన్నారు. కంది, మినుములు, మసూర్ పప్పు కొనుగోలుకు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. బిహార్‌లో మఖానా రైతుల కోసం ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేస్తామని అన్నారు. అదేవిధంగా అధిక దిగుబడి విత్తనాల వృద్ధి కోసం ప్రత్యేక ప్రణాళికను రూపొందిస్తామని అన్నారు. అదేవిధంగా కిసాన్ క్రెడిట్ రుణాలు పెంచుతున్నట్లుగా ప్రకటించారు. రైతులకు ఇచ్చే వడ్డా రాయితీ రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచుతున్నామని అన్నారు.


Next Story