Maha Kumbh Mela : మహాకుంభ మేళాలో పోలీస్ అధికారి దుశ్చర్య..మాజీ సీఎం ఫైర్

by Y. Venkata Narasimha Reddy |
Maha Kumbh Mela : మహాకుంభ మేళాలో పోలీస్ అధికారి దుశ్చర్య..మాజీ సీఎం ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్ : మహా కుంభ మేళా(Maha Kumbh Mela)లో కోట్లాది మంది భక్తులకు అవసరమైన వసతుల కల్పన..రద్ధీ నియంత్రణలో ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం తంటాలు పడుతుంది. ప్రపంచంలోనే అతిపెద్ధ ఆధ్యాత్మిక ఘట్టమైన మహాకుంభమేళాలో ప్రభుత్వ యంత్రాంగం పనితీరు కూడా ప్రభుత్వంపై ప్రభావం చూపుతోంది. ఇప్పటికే మౌని అమవాస్య రోజున తొక్కిసలాటలో 30మంది మృతి చెందడం..మరో 60మందికి గాయాలవ్వడం యూపీ సీఎం యోగి ఆధిత్యనాద్ ప్రభుత్వ ప్రతిష్టను మచ్చగా మారింది. ఇది చాలదన్నట్లుగా ఎక్కడెక్కడి నుండో ప్రయాగ్ రాజ్ మహాకుంభ మేళాకు తరలివస్తున్న భక్తుల పట్ల కొంతమంది ప్రభుత్వ అధికారులు, సిబ్బంది వ్యవహరిస్తున్న తీరు ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేదిగా మారింది.

మహాకుంభ మేళాకు వచ్చిన భక్తులకు స్వచ్చంద సంస్థలు సిద్ధం చేస్తున్న ఆహారం పట్ల ఓ పోలీస్ అధికారి దారుణంగా ప్రవర్తించిన(Police Officer's Misconduct) తీరు వైరల్(Viral)గా మారింది. ప్రయాగ్ రాజ్ త్రివేణి సంగమంలో భక్తుల కోసం కొన్ని స్వచ్చంద సంస్థలు చేస్తున్న ఆహారంలో ఓ పోలీస్ అధికారి మట్టిపోసిన(Threw Dirt In The Food)దుశ్చర్య వివాదస్పదమైంది. ప్రయాగ్‌రాజ్‌లో ఆహారాన్ని తయారు చేసే ‘భండారా’ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. పొయ్యిపై ఆహారం వండుతున్న పాత్రలో పోలీస్ అధికారి మట్టి పోశారు.

మట్టి పోసిన పోలీస్‌ అధికారి సోరాన్ పోలీస్ స్టేషన్ ఇంచార్జీ బ్రిజేష్ తివారీగా గుర్తించారు. పోలీస్ అధికారి దశ్చర్య వీడియో క్లిప్‌ను స్వయంగా ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధ్యక్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌(Former CM Akhilesh Yadav) సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది.

అయితే ఇటీవల భక్తుల గుడారాల్లో రెండు గ్యాస్ సిలిండర్లు పేలి మంటలు చెలరేగిన అగ్ని ప్రమాద ఘటన నేపథ్యంలో 18టెంట్లు దగ్ధమయ్యాయి. ఇలాంటి అగ్నిప్రమాదాలు, తొక్కిసలాట ఘటనలు చోటుచేసుకోకుండా స్వచ్చంద సంస్థలు, భక్తుల వంటలను నియంత్రించే క్రమంలో ఆ పోలీస్ అధికారి అతిగా వ్యవహరించినట్లుగా తెలుస్తోంది. అయితే ఆహార పాత్రలో మట్టి పోసిన ఘటనపై సీరియస్ గా స్పందించిన యూపీ ప్రభుత్వం ఆ పోలీస్ అధికారిని సస్పెండ్ చేసినట్లుగా సమాచారం.


Next Story