union budget 2025: గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా, గుర్తింపు కార్డులు

by Prasad Jukanti |
union budget 2025: గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా, గుర్తింపు కార్డులు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో రోజు రోజుకు వృద్ధి చెందుతున్న గిగ్ వర్కర్ల (Gig workers) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గిగ్ వర్కర్లకు ఆరోగ్య బీమా (health insurence) సౌకర్యంతో పాటు గుర్తింపు కార్డులు (identity cards) ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ బడ్జెట్ స్పీచ్ లో ప్రకటించారు. ఈ-శ్రమ్ పోర్టల్ కింద గుర్తింపు కార్డులు, పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా అందించబోతున్నట్లు చెప్పారు. కోటి మంది గిగ్ వర్కర్లకు ప్రయోజనం కలగనుందని తెలిపింది. ఈ సందర్భంగా న్యూ ఏజ్ ఎకనామిక్ కు గిగ్ వర్కర్లు గొప్ప చైతన్యాన్ని అందిస్తున్నారని మంత్రి అభిప్రాయపడ్డారు.


Next Story