- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Union Budget 2025-26: బడ్జెట్‌లో బిహార్‌కు వరాల జల్లు..

దిశ, వెబ్‌డెస్క్: 2025-26 వార్షిక బడ్జెట్‌లో బిహార్ రాష్ట్రానికి కేంద్రం వరాల జల్లు కురిపించింది. ఇందులో భాగంగా సోలార్ సెల్స్, ఈవీ బ్యాటరీలు, విండ్ టర్బయిన్స్‌కు ఊత ఇచ్చేలా పెట్టుబడును ఆహ్వానించేందుకు కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు. అదేవిధంగా ఈవీ బ్యాటరీ పరిశ్రమలకు ప్రోత్సాహాకాల కోసం క్లీన్ టెక్ మిషన్ ప్రారంభిస్తామని తెలిపారు. మరో 120 రూట్లలో ఉడాన్ పథకాన్ని కూడా అమల్లోకి తీసుకొస్తామని అన్నారు. బీహార్ రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలకు మెరుగైన రవాణా సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి 22 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తామని పేర్కొన్నారు.
* బిహార్‌లోని మిథిలాంచల్ ప్రాంతంలో 50,000 హెక్టార్లకు ప్రయోజనం చేకూర్చే వెస్టర్న్ కోసి కెనాల్‌కు ఆర్థిక సాయం అందించనున్నారు.
* ఐఐటీ పట్నా సామర్థ్యాన్ని మరింత పెంచనున్నారు.
* పదేళ్లలో 4 కోట్ల మందికి విమాన ప్రయాణం కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్న కేంద్రం ఆ దిశగా బిహార్‌లో గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ ఏర్పాటుకు నిర్ణయం.
* బిహార్‌లో నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అండ్ మేనేజ్‌మెంట్ ఏర్పాటు చేయనున్నట్లుగా మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.
కాగా, బిహార్‌లో ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి నీతీశ్‌కుమార్ పార్టీ జేడీయూతో కలిసి భాజపా అధికారంలో ఉంది. ఆ జేడీయూ కేంద్రంలోని ఎన్డీయేలో కీలక భాగస్వామి. బిహార్‌కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చిచెప్పిన కేంద్రం.. ఎన్నికల ముందు ఇలా వరాల జల్లు కురిపించింది. గత ఏడాది సార్వత్రిక ఎన్నికల తర్వాత జులైలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో కూడా రహదారుల అభివృద్ధి, గంగానది రెండు లైన్ల వంతెన నిర్మాణం, విద్యుదుత్పత్తి కేంద్రం వంటి పలు ఆర్థిక వరాలు ఇచ్చింది.