ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్‌తో రొమాన్స్ చేయడానికి రెడీ అయిన రామ్ చరణ్ బ్యూటీ.. హైప్ పెంచుతున్న న్యూస్

by Kavitha |
ఇద్దరు పాన్ ఇండియా స్టార్స్‌తో రొమాన్స్ చేయడానికి రెడీ అయిన రామ్ చరణ్ బ్యూటీ.. హైప్ పెంచుతున్న న్యూస్
X

దిశ, సినిమా: మహేష్ బాబు(Mahesh Babu) నటించిన ‘భరత్ అనే నేను’(Bharat Ane Nenu) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ కియారా అద్వాని(Kiara Advani) గురించి స్పెషల్‌గా చెప్పనక్కర్లేదు. తన ఫస్ట్ సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామకు.. వరుస అవకాశాలు తలుపు తట్టాయి. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. ఇక రీసెంట్‌గా ఈ బ్యూటీ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) సరసన ‘గేమ్ ఛేంజర్’(game Changer) మూవీలో నటించి మెప్పించింది. శంకర్(shankar) దర్శకత్వం వహించిన ఈ మూవీకి దిల్ రాజు(Dil Raju) ప్రొడ్యూసర్.

అయితే భారీ అంచనాల నడుమ థియేటర్లలో రిలీజ్ అయిన ఈ మూవీ.. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ వ్యక్తిగత విషయానికి వస్తే.. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే బాలీవుడ్ స్టార్ హీరో సిద్ధార్థ్ మల్హోత్ర(sidhdharth Malhothra)తో డేటింగ్‌లో ఉంటూ 2023లో పెళ్లి చేసుకుంది. అప్పటినుంచి ఓ పక్క సినిమాలతో మరో పక్క ఫ్యామిలీతో లైఫ్‌ను లీడ్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. కియారా తాజాగా రెండు పాన్ ఇండియా సినిమాల్లో హీరోయిన్‌గా చాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. మరి అందులో మొదటిది బాలీవుడ్ మూవీ ‘వార్-2’(War-2).

హృతిక్ రోషన్(Hrithik Roshan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటిస్తున్న ఈ చిత్రంలో కియారా.. హృతిగా రోషన్‌కి జంటగా కనిపించబోతుందట. అలాగే రాకింగ్ స్టార్ యష్(Rocking Star Yash) నటిస్తున్న ‘టాక్సిక్’(Toxic) మూవీతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతుందట. కాగా ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార(Nayanthara) యష్ సోదరిగా నటిస్తుండగా.. రాకింగ్ స్టార్ సరసన కియారా నటిస్తోంది. ప్రస్తుతం ఈ జంట ఓ డ్యూయెట్ సాంగ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నట్లు సమాచారం.


Next Story