పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత

by Kalyani |
పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత
X

దిశ, జడ్చర్ల : పర్యావరణ పరిరక్షణ ప్రతీ ఒక్కరి బాధ్యత అని స్నేక్‌ సొసైటీ కోఆర్డినేటర్‌ కృష్ణసాగర్‌ అన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం అలంపూర్‌ నుంచి హైదరాబాద్‌కు కృష్ణసాగర్‌ చేపట్టిన యాత్ర ఆదివారం జడ్చర్ల పట్టణానికి చేరుకుంది. ఈ సందర్భంగా పట్టణ ప్రజలు పర్యావరణ ప్రేమికులు కృష్ణ సాగర్ కు ఘన స్వాగతం పలికి పూలమాలలు శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా పట్టణంలోని, అయ్యప్పస్వామి దేవాలయం, వాసవి కళ్యాణ మండపం బిఆర్ ఆర్ డిగ్రీ కళాశాలని బొటానికల్ గార్డెన్ లో తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో మున్సిపాలిటీ రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి పట్టణ ప్రజలకు పర్యావరణం పై అవగాహన కల్పించారు.

అనంతరం పాదయాత్రగా జాతీయ రహదారి వెంబడి వెళ్తూ రాజాపూర్ మండలం కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో స్థానికులతో కలిసి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కృష్ణసాగర్‌ మాట్లాడుతూ మొక్కను నాటి పరిరక్షించలేని మానవుడు సొసైటీలో జీవించే హక్కు లేదని అన్నారు. నిద్రావస్థలో ఉన్న యువతను నిద్ర లేపాలని, ఎప్పుడైనా చిన్నపిల్లలు వర్షం ఎక్కడి నుంచి వస్తుందని అడిగితే దేవుడు కురుపిస్తాడని చెప్పేవారు.. కానీ ఇప్పుడు మనం ఒక మొక్క నాటితే ఒక చుక్క వర్షం పడుతుందని చెప్పి వారి చేత మొక్కలను నాటే విధంగా చూడాలని కోరారు. పట్టుదలతో ప్రయత్నిస్తే చిన్న విత్తనమే భూమిని చీల్చుకుని మహా వృక్షంలా ఎదుగుతుందన్నారు.

ప్రతీ ఒక్కరు పాదయాత్రలో భాగస్వాములై పర్యావరణ పరిరక్షణ కోసం చర్యలు తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షకులు స్థానిక నాయకులు రంజిత్ బాబు, ప్రనిల్, చందర్, సాహితి రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ సతీష్, బొటానికల్ గార్డెన్ సమన్వయకర్త సదాశివయ్య, నాయకులు అమర్నాథ్, విజయ్, విష్ణు, నెక్స్ట్ సొసైటీ సభ్యులు గోపాల్ యాదవ్, ఉండే కోటి, దేవేందర్ పలువురు స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed