BRS పార్టీకి బిగ్ షాక్..ఆ జిల్లాలోని పార్టీ కార్యాలయానికి మున్సిపల్ అధికారుల నోటీసులు

by Jakkula Mamatha |
BRS పార్టీకి బిగ్ షాక్..ఆ జిల్లాలోని పార్టీ కార్యాలయానికి మున్సిపల్ అధికారుల నోటీసులు
X

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు మరో షాక్ తగిలింది. హన్మకొండలోని బీఆర్‌ఎస్‌ పార్టీ ఆఫీస్‌కు అనుమతి లేదంటూ మంగళవారం ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడికి నోటీసులు జారీ చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌ రెడ్డి ఫిర్యాదు మేరకు బీఆర్ఎస్‌ కార్యాలయానికి నోటీసులు ఇచ్చారు. కాజీపేట మున్సిపల్ సర్కిల్‌ కార్యాలయం నుంచి ఈ/285476/ జీడబ్ల్యూఎంసీ /ఏసీపీ-3/వార్డు నెంబర్ 30/2024 లేఖను జూన్ 25వ తేదీన అందించారు. ఈ లేఖ అందిన మూడు రోజుల్లో తీసుకున్న అనుమతి పత్రాలు సమర్పించాలని ఆ నోటీసుల్లో కొరారు.

ఇదే విషయం గతంలో రెండు పర్యాయాలు కార్పొరేషన్ అధికారులు నోటీసులు జారీ చేసేందుకు ప్రయత్నించినప్పటికీ బీఆర్ఎస్ నాయకులు తీసుకునేందుకు నిరాకరించినట్టు సమాచారం. అధికార పార్టీ ఎమ్మెల్యే తీవ్ర ఒత్తిడి నేపథ్యంలో కార్పొరేషన్ అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించి తాజాగా నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. నోటీసులపై బీఆర్ఎస్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది. కార్యాలయం నిర్మాణ అనుమతులు, అధికారిక పత్రాలు చూపెట్టకుంటే కార్పొరేషన్ ఏ విధమైన చర్యలు తీసుకుంటుందనేది రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.





Next Story

Most Viewed