పైప్ లైన్ కోసం తీసిన గుంతతో ప్రమాదాలు.. అధికారులు స్పందించాలని ప్రజల వినతి

by Aamani |
పైప్ లైన్ కోసం తీసిన గుంతతో ప్రమాదాలు.. అధికారులు స్పందించాలని  ప్రజల వినతి
X

దిశ, అబ్దుల్లాపూర్మెట్: ప్రజల అవసరం కోసమో, జలమండలి అధికారులు పనుల నిమిత్తం తీసిన గుంతనో తెలియదు కానీ, సదరు గుంతలతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. నిత్యం సాఫీగా ప్రయాణం జరిగే ఈ రోడ్డుపై అకస్మాత్తుగా గుంతలు తీయడంతో వాహనదారులు అదుపుతప్పి గాయాల పాలైన ఘటన పెద్ద అంబర్ పేట మున్సిపాలిటీ పరిధిలోని కుంట్లూర్ -పసుమాముల రోడ్డుపై చోటు చేసుకుంటుంది. వివరాల్లోకి వెళితే కుంట్లూరు వై జంక్షన్ నుంచి పసుమములకు వెళ్లే దారిలో జలమండల అధికారులో లేక స్థానికలో రోడ్డుపై పైప్ లైన్ గుంత తీశారు. దానికి సంబంధిత అధికారులు అనుమతులు ఉన్నాయా లేవో తెలియదు కానీ సడన్ గా తీసిన గుంతతో నిత్యం సాఫీగా వెళుతున్న వాహనదారులు అదుపుతప్పి ప్రమాదాల బారిన పడుతున్నారు. గత రెండు రోజుల్లో నాలుగైదు ద్విచక్ర వాహనాలు నడిపే వ్యక్తులు గాయాల పాలు కాగా కార్లు సైతం పెద్ద ఎత్తున గుంతలో పడి పాడవుతున్నాయి. ఈ విషయాన్ని స్థానికులు సంబంధిత వాట్సాప్ సోషల్ మీడియా గ్రూపుల్లో అధికారులకు విన్నవించుకుంటున్నారు.ఇప్పటికైనా అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story

Most Viewed