- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
పేదవైశ్యుల అభివృద్ధిని అడ్డుకుంటున్న వారెవరు..
దిశ, ఖమ్మం సిటీ : ఆర్యవైశ్య నగర మహాసభలో అంతర్ కుమ్ములాటలు మొదలయ్యాయి. గత కొన్ని ఏళ్లుగా ఆర్యవైశ్య మహాసభల ఆధ్వర్యంలో కార్తీకమాస వనభోజనాలు నిర్వహించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. వనభోజనాలు నిర్వహించాలంటే అయ్యే ఖర్చు ఆర్య వైశ్య ఆస్తులు ద్వారా వచ్చే ఆదాయంతోనే నిర్వహించవచ్చు కానీ మళ్ళీ వనభోజనాల పేరుతో డబ్బులు వసూళ్లు చేయడం పలువిమర్శలు ఎదురవుతున్నాయి. మా డబ్బులతో మాకే తినిపిస్తే ఎలా అని కొందరు విమర్శిస్తుంటే మరి కొందరు గతంలో లెక్కలు తేల్చాలని డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే 2022వ సంవత్సరంలో ఏర్పాటు చేసిన వనభోజనాలకు వచ్చిన డబ్బులు ఎంత ఖర్చు పెట్టిందెంత తెలియాలంటూ మరికొందరు సంఘ సభ్యుల పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ నెల 24న వనభోజనాలకు ఏర్పాట్లకు ముందే నిలదీస్తుండటంతో వారే తెరచాటున ఉండి సమస్యలు పెరగకుండా రాజికుదురుస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ చర్చ జరగడం వల్ల సంఘ పెద్దల మెడకు చుట్టుకునే పరిస్థితి తలెత్తడంతో వారు గొడవ పెట్టుకున్న వారికి సర్దిచెప్పి వనభోజనాలు ఏర్పాటుకు రంగం ముమ్మరం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇదంతా ఆర్యవైశ్య ఆస్తులు ఎన్ని ఉన్నాయి వాటి నుండి వచ్చే ఆదాయంతో ఏ పేద వైశ్యుడికి ఎంత లాభం చేకూరింది అనే లెక్కలు ఏ ఒక్క సభ్యుడికి తెలియదంటే అతిశయోక్తి ఏమి లేదు. దీనిని అడ్డుపెట్టుకున్న పెద్దలు కొందరు తెరవెనుక ఉండి ఆర్యవైశ్య ఆస్తులను ఇష్టానికి వాడుకున్నట్లు ఆరోపణలు వినపడుతున్నాయి. కోట్ల విలువ చేసే భూములు, ఆస్తులు నగరంలో ఉన్నప్పటికీ నిరుపేద వైశ్యులకు అవి ఉపయోగపడడం లేదంటే సంఘంలో వారి పాత్ర ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కొన్నేళ్ల క్రితం పేద ఆర్యవైశ్యులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈ ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వారికి ఖర్చుపెట్టె అందుకు ఆర్యవైశ్య పూర్వికులు అన్న సత్రాలను, సేవా సంస్థలను ఏర్పాటు చేసి వాటిని ఉపయోగపడేలా ఏర్పాటు చేశారు.
రాను రాను ఆ ఆస్తులకు విలువ పెరగడంతో వాటి పై కన్నువేసిన పెద్దలు కొందరు వాటిని వారి గుప్పిట్లో పెట్టుకుని ఫిక్స్ డ్ డిపాజిట్ల పేరుతో వచ్చిన వడ్డీని కూడా సొంతాలకు ఉపయోగించుకుంటున్నారని సంఘంలోని మరికొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో నర్తకి టాకీస్ రోడ్లో రైల్వే ట్రాక్ సమీపంలో ఉన్న ఆర్యవైశ్య ఆస్తికి సంబంధించిన గ్రంథాలయ భవనాన్ని రైల్వే శాఖ కూల్చి ఆ ఆస్తికి సంబంధించి సుమారు రూ. 70 లక్షలకు పైగా నష్టపరిహారం చెల్లిస్తే ఆ డబ్బులు పేద ఆర్యవైశ్యులకు వినియోగించకుండా ఫిక్స్ డిపాజిట్ చేసినట్లు తెలుస్తుంది. వీటి ద్వారా వచ్చే వడ్డీ ఎవరు మింగుతున్నారో తెలియని పరిస్థితిలో ఆర్యవైశ్యులు ఉన్నారనేది వాస్తవం. ఇదొక్కటే కాక నగరంలో పలు ప్రాంతాల్లో ఆర్యవైశ్య ఆస్తులు ఉన్నప్పటికీ వాటి నుండి వచ్చే ఆదాయం కూడా ఎటు పోతుందో తెలియని పరిస్థితిలో పేద, మధ్యతరగతి ఆర్యవైశ్యులు ఉన్నారు. వీరిని చైతన్యపరిస్తే ఎక్కడ పెద్దల భాగోతాలు బయటపడతాయో అని వారు తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కొంతమందిని ఎంపిక చేసి వారి ప్రతినిధులుగా సంఘ పెద్దలుగా చలామణి చేస్తూ ఆస్తుల పై అజమాయిషీ కొనసాగిస్తున్నట్లు విమర్శలు లేకపోలేదు.