Police : గ్రూప్ 3 విదార్థినికి సీఐ సహాయం..ప్రశంసల వెల్లువ

by Y. Venkata Narasimha Reddy |   ( Updated:2024-11-17 06:18:55.0  )
Police : గ్రూప్ 3 విదార్థినికి సీఐ సహాయం..ప్రశంసల వెల్లువ
X

దిశ, వెబ్ డెస్క్ : నిత్యం విధి నిర్వాహణలో కాఠిన్యంగా వ్యవహరించే ఖాకీలు(పోలీసులు) యూనిఫామ్ ఇగోను దాటి అందించే సేవలు తరుచూ ప్రశంసలందుకుంటుంటాయి. ఇప్పుడు గ్రూప్ 3 (Group3) పరీక్షల సందర్భంగా జీడిమెట్ల సీఐ(Jedimetla CI)చూపిన మానవతా సహాయం అందరి అభినందనలు(Appreciations)అందుకుంటుంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పరీక్ష కేంద్రం గుర్తింపులో పొరబడిన గ్రూప్ 3 విద్యార్థినికి పోలీస్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ నుండి అందిన సహాయం ఆ విద్యార్థినిని సకాలంలో పరీక్షకు హాజరయ్యేలా చేసింది. ఆదివారం జరిగిన గ్రూప్ 3 పరీక్ష రాసేందుకు ఓ విద్యార్థిని జీడిమెట్లలోని గౌతమి కాలేజీ పరీక్ష కేంద్రానికి వచ్చింది.

అయితే తన పరీక్ష కేంద్రం బాలానగర్ లోని గీతాంజలి కళాశాల అని తెలుసుకున్న ఆ విద్యార్థిని ఖంగుతింది. పరీక్ష సమయానికి అక్కడికి చేరుకునేదెట్లా అని తీవ్రంగా ఆవేదన చెందుతోంది. అక్కడే ఉన్న జీడిమెట్ల ట్రాఫిక్ సీఐ ఆ విద్యార్థిని పరిస్థితిని అర్థం చేసుకుని మానవతా సహాయంతో ఆమెను తమ పోలీస్ వాహనంలో తీసుకెళ్లి సమయానికి పరీక్ష కేంద్రానికి చేర్చారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కాగా ..ఇది కదా ఫ్రెండ్లీ పోలీస్ అంటూ పోలీసులు చేసిన సహాయానికి అభినందనలు కురిపిస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed