- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TGSRTC : రవాణా సేవలు అందిస్తాం.. మానవత్వం చాటుతాం! సిబ్బంది ఉదారతపై ప్రశంసలు
దిశ, డైనమిక్ బ్యూరో: (TGSRTC) బస్సులో తీవ్ర అవస్థకు గురైన ప్రయాణికురాలిని సకాలంలో ఆస్పత్రికి తరలించి ఆర్టీసీ సిబ్బంది తమ ఉదారతను చాటుకున్నారు. (Hyderabad-Kalwakurthy) హైదరాబాద్-కల్వకుర్తి రూట్ బస్సులో ఆదివారం నందిని అనే మహిళా ప్రయాణిస్తుండగా.. బస్సు తుక్కుగూడ సమీపంలోకి వచ్చాక ఆమెకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చింది. ఈ విషయాన్ని గమనించిన కల్వకుర్తి డిపో కండక్టర్ శశికళ.. డ్రైవర్ అంజయ్యను అప్రమత్తం చేశారు. బస్సును ఆపించి అంబులెన్స్ కి సమాచారం ఇచ్చారు. అంబులెన్స్‌లో ఆమెని కడ్తాల్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం ప్రయాణికురాలి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
బస్సులో కడుపు నొప్పితో బాధపడుతున్న ప్రయాణికురాలికి సకాలంలో వైద్యం అందేలా చొరవ తీసుకున్న కల్వకుర్తి డిపో కండక్టర్ శశికళ, డ్రైవర్ అంజయ్యను టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ (VC.Sajjanar) ప్రశంసించారు. ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించడంతో పాటు మానవత్వం చాటుకోవడంలోనూ తామేమీ తక్కువ కాదని ఆర్టీసీ సిబ్బంది నిరూపిస్తుండటం సంతోషదాయకని ఆదివారం ఎక్స్ వేదికగా ఈ వివరాలను వెల్లడించారు.