- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిజామాబాద్ జిల్లాలో 66 కేంద్రాల్లో గ్రూప్ - 3 పరీక్షలు..
దిశ ప్రతినిధి, నిజామాబాద్ : తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఆది, సోమ వారాల్లో రెండు రోజుల పాటు జరుగనున్న గ్రూప్ - 3 పరీక్షలు నిజామాబాద్ లో ఆదివారం ప్రారంభమయ్యాయి. ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించబడే మొదటి సెషన్ పరీక్ష కోసం అభ్యర్థులు గంట ముందు నుంచే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లాలో మొత్తం 19,941 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరు కానున్నారు. అభ్యర్థుల సంఖ్యకు అనుగుణంగా అధికారులు మొత్తం 66 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కాపీయింగ్ కు ఆస్కారం లేకుండా ప్రతి మూడు కేంద్రాలకు ఒకరు చొప్పున 22 మంది ఫ్లయింగ్ స్క్వాడ్ లను కూడా నియమించారు. సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు అనుక్షణం నిశిత పర్యవేక్షణ జరూపుతాయని, సీసీ కెమెరాల నిఘాలో పరీక్షలు జరుగుతాయని కలెక్టర్ స్పష్టం చేశారు.
బయోమెట్రిక్ విధానం ద్వారా వేలిముద్రల సేకరణ ప్రక్రియ చేపట్టాల్సి ఉన్నందున అభ్యర్థులు నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. ఉదయం పరీక్షకు సంబంధించి 9.30 గంటల వరకే పరీక్షా కేంద్రంలోనికి వెళ్లేందుకు అనుమతించారు. అనంతరం గేట్లు మూసివేస్తారని జిల్లా కలెక్టర్ ముందుగానే ప్రకటించడంతో అభ్యర్థులు గంట ముందు నుంచే కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రంలోకి మొబైల్ ఫోన్, పుస్తకాలు, ఎలక్ట్రానిక్ ఉపకరణాలు తీసుకెళ్లేందుకు అనుమతించలేదు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించాకే అభ్యర్థులను పరీక్ష కేంద్రంలోనికి అనుమతించారు.