- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మూసీ ప్రక్షాళనను అడ్డుకుంటే..నల్గొండ నుంచి పోరాటం..
దిశ నకిరేకల్ : మూసీ నది ప్రక్షాళనను అడ్డుకుంటే నల్లగొండ జిల్లా నుంచి పోరాటం మొదలవుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హెచ్చరించారు. బీజేపీ చేసేది మూసీ నిద్రలా లేదని తీర్థయాత్రల నిద్రలా ఉందని ఎద్దేవా చేశారు. మూసి ప్రక్షాళన చేస్తే సీఎం రేవంత్ రెడ్డికి పేరొస్తుందని..అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. నకిరేకల్ పట్టణంలోని పన్నాల గూడలో తన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ విధంగా మాట్లాడారు. బీజేపీ ఇతర రాష్ట్రాలలో నదుల ప్రక్షాళన చేయట్లేదా అక్కడ ఇల్లు కూల్చడం లేదా దానికి కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. మూసీ ప్రక్షాళన చేస్తామని చెప్పిన వెంటనే రంగారెడ్డి ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు ఊపిరి పీల్చుకున్నారన్నారు. తమకు మంచినీళ్లు వస్తాయని 1000 కళ్ళతో ఎదురుచూసిన రోజులు దగ్గరలో ఉన్నాయని ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు. మూసి పక్కనే పడుకోకుండా ఎక్కడో నిద్ర చేసి మూసీ నిద్ర అంటున్నారని మండిపడ్డారు. ఈ నిద్ర చేసేవాళ్లు మూసీ నీళ్లతోనే ముఖం కడుక్కోవాలని ఆ నీళ్లతోనే స్నానం చేయాలని డిమాండ్ చేశారు.
మూసీ ప్రక్షాళన డిపిఆర్ తయారు కాకుండానే అవినీతి జరిగిందని మాట్లాడుతున్నారన్నారు. ఈ ప్రక్షాళనతో మీకు వచ్చే నష్టమేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. డబ్ల్యూహెచ్వో చెప్పిన మాటలను హెచ్చరికలను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు. మూసీ ప్రక్షాళన అడ్డుకుంటే ఎవరు కూడా నల్లగొండ జిల్లాలో తిరగలేరని హెచ్చరించారు. దీంతో తిరుగుబాటు జైత్రయాత్ర చేస్తామన్నారు. మూసీ మురికి కుప్పంలో ఉన్న ప్రజలను సురక్షితమైన చోటుకు తరలిస్తుంటే బీఆర్ఎస్ ,బీజేపీ నాయకులు రాజకీయం కోసం డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు టీం లాగా పనిచేస్తుందన్నారు. ఈటల రాజేందర్ సైతం ద్వంద వైఖరిని అవలంబిస్తున్నారని ఆరోపించారు. ఒకనాటి మూసీ నది నీళ్లు మళ్లీ తీసుకువచ్చి ఆ నీటిని నల్లగొండ జిల్లా ప్రజలకు అందించేందుకు సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. నల్లగొండ జిల్లా ప్రజల కష్టాలు మీ పార్టీలకు అవసరం లేనప్పుడు తమ ప్రాంత ప్రజలకు కూడా మీ పార్టీలతో అవసరం లేదని విషయాన్ని గ్రహించుకోవాలన్నారు.