- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రశాంతంగా గ్రూప్ 3 పరీక్ష
దిశ, సిద్దిపేట ప్రతినిధి : ప్రభుత్వ శాఖల్లోని పలు ఉద్యోగాల భర్తీకి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన గ్రూప్ -3 పరీక్షలు ఆదివారం ప్రశాంతంగా సాగాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని 37 పరీక్ష కేంద్రాల్లో ఉదయం సెషన్ లో జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీ పేపర్ 1 కు 13,408 అభ్యర్థులకు 7421 మంది అభ్యర్థులు హాజరు కాగా, 5988 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్ లో హిస్టరీ-పాలిటి- సొసైటీ పేపర్-2 కు 13,408 అభ్యర్థులకు 7312 మంది అభ్యర్థులు హాజరు కాగా, 6097 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. నిమిషం నిబంధన నేపథ్యంలో అభ్యర్థులకు గంట ముందు నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అధికారులు అనుమతించారు. పరీక్ష కేంద్రాలలోకి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించలేదు. సాధారణ చేతి గడియారం మాత్రమే అనుమతి ఇచ్చారు.
పరీక్ష కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడంతో పాటుగా బీఎన్ సీసీ 163 సెక్షన్ అమలు చేశారు. సిద్దిపేట పట్టణంలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అంబిటస్ హైస్కూల్, ఎస్ ఆర్ డీజీ స్కూల్, సిద్ధార్థ హై స్కూల్ పరీక్ష కేంద్రాలను కలెక్టర్ మిక్కిలినేని మనుచౌదరి సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ అబ్దుల్ హమీద్ పలు పరీక్ష కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును పరిశీలించారు. ఇందూర్ ఇంజనీరింగ్ కాలేజ్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్, కాలేజ్ ఏన్సాన్ పల్లి పరీక్ష కేంద్రాలను పోలీస్ కమిషనర్ డా. బీ అనురాధ సందర్శించి బందోబస్తు ఏర్పాట్లను పరిశీలించి అధికారులకు సూచనలు చేశారు. నిమిషం నిబంధన నేపథ్యంలో జిల్లా పరిధిలో సుమారు 36 మంది అభ్యర్థులు పరీక్ష రాయలేక పోయినట్లు సమాచారం. సోమవారం ఉదయం 10గంటల నుంచి 12:30 గంటల వరకు ఎకానమీ డెవలప్‌మెంట్ పేపర్-3 పరీక్ష జరగనుంది.